తన తండ్రిని తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని.. బంగాల్ భీర్భుమ్ జిల్లాకు చెందిన ఓ బాలిక.. ప్రభుత్వంపై కోపం పెంచుకుంది. స్థానిక భాజపా నేత అయిన తన తండ్రి అరెస్ట్‌కు నిరసనగా ప్రభుత్వం అందించే ఉచిత సైకిల్‌ను తీసుకునేందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని ఆ బాలిక చదువుతున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెల్లడించారు. ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించినట్టు పేర్కొన్నారు.
'చాలా కష్టాలు పడ్డాం..'
మౌత్రిష దేయ్.. పదో తరగతి చదువుతోంది. తండ్రి సుశాంత దేయ్ స్థానిక భాజపా నేత. అయితే 2020 సెప్టెంబర్ 17న ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన తండ్రి పోలీసు కస్టడీలో ఉన్నన్ని రోజులు తాము చాలా ఇబ్బందులు పడ్డామని దేయ్ పేర్కొంది. అయితే ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.