తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Election Tamil Nadu) డీఎంకే ఆధిపత్యం చెలాయించింది. అక్టోబరు 6, 9 తేదీల్లో తొమ్మిది జిల్లాల్లో విడతల వారీగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచే (Local Body Election Tamil Nadu) డీఎంకే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మంగళవారం రాత్రి 10:30 వరకు జిల్లా పంచాయతీ వార్డుల్లో 11 స్థానాల్లో గెలుపొందగా మరో 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పంచాయతీ యూనియన్ వార్డుల్లో కూడా 234 స్థానాల్లో విజయం సాధించింది. మరో 149 స్థానాల్లో ముందంజలో ఉంది.
మరోవైపు అన్నాడీఎంకేకు ఈ ఎన్నికల్లో (Local Body Election Tamil Nadu) ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పంచాయతీ వార్డుల్లో 4 స్థానాలు.. పంచాయతీ యూనియన్ వార్డుల్లో 31 స్థానాల్లో గెలుపొందగా.. 26 స్థానాల్లో మాత్రమే ఆధిపత్యం కొనసాగించగలిగింది.