తమిళనాడు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాలుగు జిల్లాల కార్యదర్శులకు ఇన్నోవా కార్లను కానుకగా ఇచ్చింది భాజపా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. సుమారు 20ఏళ్ల తరువాత రాష్ట్రంలో కమలనాథులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించగలిగారు. దీంతో వారు గెలిచిన జిల్లాల కార్యదర్శులకు ఇలా కార్లను కానుకగా ఇచ్చింది పార్టీ అధిష్ఠానం.
ఇన్నోవా కార్లు దక్కించుకున్న వారిలో కోయంబత్తూర్ సెక్రెటరీ నందకుమార్, తిరునెల్వేళ్లి సెక్రెటరీ మహారాజన్, ఏరోడ్ సెక్రెటరీ సుబ్రమణియన్, కన్యాకుమారి సెక్రెటరీ ధర్మరాజన్లు ఉన్నారు. వీరికి కేంద్రమంత్రి ఎల్ మురగన్ కార్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై, పార్టీ సీనియర్ నేత సీపీ రాధాక్రిష్ణన్లు హాజరయ్యారు.