తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో టీఎంసీ కార్యకర్త హత్య - టీఎంసీ కార్యకర్తపై దాడి

బంగాల్​లోని కేశ్​పుర్​లో ఓ తృణమూల్​ కాంగ్రెస్​ కార్యకర్త హత్యకు గురయ్యాడు. రెండో విడత ఎన్నికల ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Tmc worker killed
బంగాల్​లో టీఎంసీ కార్యకర్త హత్య

By

Published : Apr 1, 2021, 8:55 AM IST

Updated : Apr 1, 2021, 9:11 AM IST

బంగాల్​ పశ్చిమ మేదినీపుర్​లోని కేశ్​పుర్​లో ఓ తృణమూల్​ కాంగ్రెస్​ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో రెండో దశ పోలింగ్​ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

కేశ్​పుర్​లోని స్థానిక టీఎంసీ కార్యకర్త ఉత్తమ్​ దోలుయ్​(48)పై పది నుంచి పదిహేను మంది దుండగులు.. పదునైన ఆయుధాలతో దాడి చేశారని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఉత్తమ్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

భాజపా కార్యకర్తలే.. ఉత్తమ్​ని హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇదీ చూడండి:బంగాల్​-అసోంలో జోరుగా రెండో దశ పోలింగ్​

Last Updated : Apr 1, 2021, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details