తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తృణమూల్​ కార్యకర్తలపై బాంబు దాడి- ఒకరు మృతి - మెదినీపుర్​ జిల్లా

బంగాల్​లో​ అధికార తృణమూల్​ కార్యకర్తలపై బాంబు దాడి జరిగింది. బైక్​పై​ వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. కల్వర్ట్​పై కూర్చున్న ముగ్గురు కార్యకర్తలపై బాంబులు విసిరారు. అక్కడి నుంచి పారిపోతున్న వ్యక్తిని తుపాకీతో కాల్చారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

TMC
తృణమూల్​ కార్యకర్తలపై బాంబు దాడి, ఒకరి మృతి

By

Published : Feb 24, 2021, 7:15 AM IST

గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో తృణమూల్​ పార్టీ కార్యకర్త మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బంగాల్​లోని​ మెదినీపుర్​ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది.

శౌభిక్​ దౌల్​తో పాటు మరో ఇద్దరు తృణమూల్​ కార్యకర్తలు అభిరామ్​పురం అనే గ్రామంలోని ఓ కల్వర్టు మీద రాత్రి 9 గంటలకు కూర్చోని ముచ్చటిస్తున్నారు. అకస్మాత్తుగా బైక్​పై వచ్చిన ముగ్గురు..అక్కడ కూర్చున్న వారిపై బాంబులు విసిరారు. భయంతో అక్కడినుంచి పారిపోతున్న దౌల్​ను తుపాకీతో కాల్చారు అని పోలీసులు తెలిపారు.

గాయపడిన ముగ్గురిని ఖరగ్​పుర్​ ఆసుపత్రికి తీసుకెళుతుండగా దౌల్​ మృతి చెందాడని పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనలో భాజపా కార్యకర్తల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ స్థానిక తృణమూల్​ నేత వారిపై ఫిర్యాదు చేశారు. ఈ హత్యలో తమ కార్యకర్తల ప్రమేయం లేదని భాజపా జిల్లా అధ్యక్షుడు సమిత్​ దాస్​ తెలిపారు. తృణమూల్​ పార్టీలోని అంతర్గతకలహాల ఫలితమే ఈ ఘటన అని అన్నారు.

ఇదీ చూడండి:ఎర్రకోట ఘటనలో ప్రముఖ ​రైతు నేత అరెస్టు

ABOUT THE AUTHOR

...view details