తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విజయం కోసం రూ.154 కోట్లు ఖర్చు చేసిన మమత!

అసెంబ్లీ ఎన్నికల్లో(bengal election 2021 ) పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి మరోమారు అధికారం చేపట్టటంలో విజయం సాధించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే.. అందుకోసం భారీగా ఖర్చు(poll expenses) చేశారు. ఎన్నికల ప్రచారం కోసం టీఎంసీ రూ.154 కోట్ల మేర ఖర్చు చేసినట్లు ఈసీకి సమర్పించిన డేటా ద్వారా వెల్లడైంది.

Mamata banerjee
మమతా బెనర్జీ

By

Published : Oct 3, 2021, 4:47 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో(bengal election 2021 ) విజయఢంకా మోగించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది తృణమూల్​ కాంగ్రెస్(Trinamool Congress). ఈ ఎన్నికల కోసం​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ ఏకంగా రూ.154.28 కోట్లు ఖర్చు(poll expenses) చేసింది. ఈ విషయం.. ఎన్నికల ప్రచారం, ఇతర అవసరాల కోసం చేసిన ఖర్చుపై ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదిక ద్వారా వెల్లడైంది.

మరోవైపు.. తమిళనాడులో అధికార కూటమిని ఓడించి పాలనా పగ్గాలను చేపట్టిన ద్రవిడ మున్నెట్ర కళగం(డీఎంకే).. ఇటీవల జరిగిన తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో(Tamilnadu assembly polls 2021) రూ.114.14 కోట్లు ఖర్చు చేసింది.

ఎన్నికల్లో పార్టీల ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా తమ వెబ్​సైట్​లో పెట్టింది ఎన్నికల సంఘం. ఇతర పార్టీల లెక్కలు ఇలా ఉన్నాయి..

  • తమిళనాడులో ఇటీవలి ఎన్నికల్లో(Tamilnadu assembly polls 2021) అధికారం కోల్పోయిన అన్నాడీఎంకే(ఏఐఏడీఎంకే).. రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ప్రచారం కోసం రూ.57.33 కోట్లు ఖర్చు(poll expenses) చేసింది.
  • కాంగ్రెస్​.. ఈ ఏడాది జరిగిన అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రూ.84.93 కోట్లు ఖర్చు(poll expenses) చేసింది.
  • సీపీఐ.. నాలుగు రాష్ట్రలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కోసం కేవలం రూ.13.19 కోట్లు వ్యయం చేసినట్లు చూపించింది.
  • ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేసిన ఖర్చు వివరాలు ఇంకా తెలియలేదు.

ఇదీ చూడండి:భవానీపుర్​లో దీదీ విజయఢంకా- 58 వేల ఓట్ల తేడాతో గెలుపు

ABOUT THE AUTHOR

...view details