తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త సంబంధం లేదన్నాడు కానీ.. నుస్రత్​ ప్రెగ్నెంటే ! - నుస్రత్ జహాన్ తాజా ఫోటోలు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ గర్భవతి ఓ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది. నుస్రత్ ప్రెగ్రెన్సీ అంటూ వచ్చిన వార్తలకు ఈ ఫొటో మరింత బలాన్ని చేకూర్చింది. తన భర్త నిఖిల్​ జైన్​తో తెగదెంపులు చేసుకున్నట్లు ఇటీవల నుస్రత్ తెలిపారు.

TMC MP Nusrat Jahan'
నుస్రత్​ ప్రెగ్నెంటే

By

Published : Jun 12, 2021, 7:34 PM IST

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్​ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నుస్రత్ గర్భవతి అంటూ.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. అయితే దీనికి తనకు సంబంధం లేదని నుస్రత్ భర్త నిఖిల్​ జైన్ ఇప్పటికే చెప్పుకొచ్చారు.

నుస్రత్​ జహాన్ వైరల్ ఫోటో​

తన భర్త నిఖిల్​ జైన్​తో తెగదెంపులు చేసుకున్నట్లు నుస్రత్ కూడా ప్రకటించారు​. ఈ నేపథ్యంలో నుస్రత్​ బేబీ బంప్​ ఫొటోలు వైరల్​ కావడం గమనార్హం. భర్తతో విడిగా ఉంటున్న నుస్రత్​ గర్భవతి ఎలా అయ్యిందనే చర్చ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా జరుగుతోంది. ఆమె సినీనటి కావడం వల్ల అటు ఫిల్మ్​ ఇండస్ట్రీలో.. ఎంపీ కావడం వల్ల ఇటు రాజకీయ వర్గాల్లో నుస్రత్​ ప్రెగ్నెన్సీ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఫొటోలో నుస్రత్​తో పాటు బంగాలీ నటి స్రవంతి ఛటర్జీ ఉన్నారు.

ఇదీ చదవండి :నిఖిల్​తో పెళ్లైంది.. కానీ చెల్లదు: ఎంపీ నుస్రత్​

ABOUT THE AUTHOR

...view details