తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Three people killed in Nellore district: నెల్లూరు జిల్లాలో ముగ్గురి ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు - Three people killed in Nellore

Three_people_killed_in_Nellore_district
Three_people_killed_in_Nellore_district

By

Published : Aug 6, 2023, 4:24 PM IST

Updated : Aug 6, 2023, 5:58 PM IST

16:19 August 06

ముగ్గురిని హత్య చేయించిన వియ్యంకుడి కుటుంబం..!

Three people killed in Nellore district: నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురి కావటం సంచలనంగా మారింది. మృతులు కృష్ణయ్య, కూతురు మౌనిక, అత్త శాంతమ్మగా గుర్తించారు. ఇంట్లోనే హత్య చేసి తలుపులు మూసేసి.. పరార్ అయ్యారు. ఆస్తి వివాదమే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇటీవల అనారోగ్యంతో కృష్ణయ్య కూతురు మౌనిక భర్త మధు మృతి చెందాడు. తరువాత ఆస్తి వివాదం మొదలైంది. మౌనిక భర్త తరఫు కుటుంబ సభ్యులే ఈ హత్యలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Aug 6, 2023, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details