ఫ్రాన్స్ నుంచి మరో 3 రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నాయి. నాలుగో దశలో భాగంగా ఫ్రాన్స్‌లోని ఐస్ట్రెస్ ఎయిర్ బేస్ నుంచి ఎక్కడా ఆగకుండా నేరుగా భారత్‌లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో మార్గమధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాయుసేన ట్యాంకర్లు గాలిలోనే రఫేల్ జెట్లకు ఇంధనం నింపాయి. ఇది ఇరు దేశాల బలమైన సంబంధాలను సూచిస్తోందని పేర్కొంది భారత వాయుసేన.
" ఫ్రాన్స్‌లోని ఐస్ట్రెస్ ఎయిర్ బేస్ నుంచి నేరుగా భారత భూభాగంలో అడుగుపెట్టాయి నాలుగో దశ రఫేల్ యుద్ధ విమానాలు. మార్గ మధ్యలో రఫేల్‌కు ఇంధనం నింపిన యూఏఈ వాయుసేనకు కృతజ్ఞతలు. ఇరు దేశాల వాయుసేనల మధ్య సంబంధాల్లో ఇదో కీలక మైలురాయి. "
- భారత వాయుసేన.
అయితే.. ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడ ల్యాండ్ అయ్యాయనేది వెల్లడించలేదు.
భారత అమ్ములపొదిలో 14 రఫేల్‌లు