తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమార్తెను ప్రేమించాడని సుపారీ ఇచ్చి హత్య.. 33 రోజుల తర్వాత.. - కుక్కతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు

ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడని ఓ యువకుడిని హత్య చేయించాడు ఓ వ్యక్తి. 33 రోజుల తర్వాత బాధితుడి మృతదేహం బయటపడింది.

youth murder in raipur
యువకుడి హత్య

By

Published : Oct 30, 2022, 10:31 AM IST

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని బీర్​గావ్​లో దారుణం జరిగింది. తన కుమార్తెను ప్రేమించిన యువకుడిని హత్య చేయించాడు ఓ వ్యక్తి. 33 రోజుల తర్వాత పూడ్చిపెట్టిన బాధితుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బీర్​గావ్ కాంగ్రెస్​ మున్సిపల్ కౌన్సిలర్ ఇక్రమ్ అహ్మద్​ మేనల్లుడని పోలీసులు తెలిపారు.

బీర్​గావ్​కు చెందిన వహాజుద్దీన్ సెప్టెంబర్ 25న కనిపించకుండా పోయాడు. కొద్దిరోజులు వహాజుద్దీన్ కోసం వెతికిన అతని కుటుంబ సభ్యులు.. అక్టోబరు 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని పోలీసులకు తెలిపారు. ఫిరోజ్ ఖాన్​ అనే వ్యక్తిని అనుమానితుడిగా పరిగణించి విచారించగా.. విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్​గావ్​కు చెందిన వహాజుద్దీన్​(21) అదే ప్రాంతానికి అమ్మాయిని ప్రేమించాడు. తన కూతురిని వహాజుద్దీన్ ప్రేమిస్తున్న విషయం కరీం ఖాన్​కు తెలిసింది. మాఫియాతో సంబంధం ఉన్న ఆమె తండ్రి కరీం ఖాన్... తన కుమార్తెను ప్రేమించవద్దని వహాజుద్దీన్​ను హెచ్చరించాడు. ఎంతకీ బాధితుడు వినకపోవడం వల్ల యువకుడిని హత్య చేసేందుకు మనుషులను మాట్లాడాడు. హత్యకు ప్లాన్ చేసి విశ్వనాథ్​, ఫిరోజ్ ఖాన్​ను పురమాయించాడు. వీరిద్దరూ కలిసి సెప్టెంబరు 25న వహాజుద్దీన్​ను హత్యచేసి.. రామేశ్వర్​ నగర్​ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద పూడ్చిపెట్టేశారు. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

యూట్యూబ్​లో చేతబడి వీడియోలు చూసి..
హరియాణా పానీపత్​లో ఏడేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు యోగేశ్.. ఓ బాలికను నరబలి ఇచ్చిన విషయంపై కీలక వివరాలు రాబట్టారు పోలీసులు. నిందితుడు యూట్యూబ్‌లో చేతబడి వీడియోలు చూసేవాడని పోలీసులు తెలిపారు. కాళీమాతను నిత్యం పూజిస్తానని తెలిపాడని పేర్కొన్నారు.

అమ్మాయిలను లొంగదీసుకోవడానికి నిందితుడు యోగేశ్ చేతబడి నేర్చుకుంటున్నాని పోలీసులు వెల్లడించారు. అందుకోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసేవాడని.. చేతబడిలో ప్రావీణ్యం సంపాదించడానికి బాలికను చంపాలని ప్లాన్ చేశాడని పేర్కొన్నారు. అందుకే ఏడేళ్ల చిన్నారిని టార్గెట్ చేశాడు. దీపావళి రోజున ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని అత్యాచారం చేసి కవర్​లో చుట్టి ఆమె ఇంటి పెరట్లో పడేశాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కుక్కతో అసభ్యంగా..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఓ వ్యక్తి కుక్కతో అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. బీడ్​ రోడ్డులోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. అనంతరం ఓ యువకుడు తన మొబైల్​ను హోటల్​లో మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం హోటల్ యజమాని మొబైల్​ను పరిశీలించగా.. ఓ యువకుడు కుక్కతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని హోటల్ యజమాని కిరీట్ సోనీ.. జంతు ప్రేమికుల సంఘానికి సమాచారం అందించారు. వారు నిందితుడు పరాగ్​పై సతారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్​.. ఆ పార్టీ అవకాశం ఇస్తే పోటీ!

దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు: మోదీ

ABOUT THE AUTHOR

...view details