కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు(new farm laws) వ్యతిరేకంగా దిల్లీ జంతర్‌మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేసేందుకు అనుమతించాలని కోరుతూ కిసాన్ మహాపంచాయత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు(Supreme Court news). ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సాగు చట్టాలపై స్టే విధించామని, అసలు ఆ చట్టాలు(new farm laws) అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం ప్రశ్నించింది.
" చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనకు ఎక్కడకు వెళ్లాలి అనే ప్రశ్న ఎక్కడ ఉంది? నూతన సాగు చట్టాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రస్తుతం ఆ చట్టాలు అమలులో లేవు. దేనికోసం ఆందోళన చేస్తున్నారు?"
- సుప్రీం కోర్టు.