మూడు రోజుల వయస్సుగల పిల్లవాడు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించినట్లు ఓ ప్రభుత్వ పాఠశాల ధృవీకరించింది. ఈ మేరకు అతనికి బదిలీ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సంఘటన బిహార్లో జరిగింది.
ఓ విశ్వవిద్యాలయంలో సర్టిఫికేట్లు తనిఖీలు చేస్తున్నారు. కాగా ఆ సమయంలో ప్రిన్స్ కూమార్ అనే యువకుడి సర్టిఫికేట్లను పరిశీలిస్తుండగా అతని పుట్టిన తేది తప్పని తేలింది. దాంతో అతను తిరిగి పాఠశాలకు వచ్చి సర్టిఫికేట్లో తప్పుందని సరి చేయమని కోరాడు. కానీ పాఠశాల ఉపాధ్యాయులు అందుకు తిరస్కరించి అతన్ని తరిమేశారు.
"2007 మార్చి23న గోసాయిదాస్ తెంగ్రారీ ప్రభుత్వ పాఠశాలలో నేను 8వ తరగతి పూర్తి చేశాను. పాఠశాల నాకు బదిలీ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. అయితే అందులో నా పుట్టిన తేదీని 2007 మార్చి 20గా పేర్కొంది. ప్రిన్సిపల్ కూడా ఆ సర్టిఫికేట్పై సంతకం చేశారు. అయితే పుట్టిన తేదీ తప్పుగా రాశారని సరిచేయాలని పాఠశాలకు వెళితే ఉపాధ్యాయులు నన్ను గెంటేశారు."