గుర్రానికి అంత్యక్రియలు- వేల మంది హాజరు కరోనా నిబంధనలను అతిక్రమించి గుర్రం అంత్యక్రియలకు వేల మంది తరలివచ్చారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది.
కాదసిద్దేశ్వర స్వామి పేరు మీద గోఖక్ తాలుకా ప్రజలు శౌర్య అనే పేరు గల గుర్రాన్ని వదిలారు. అయితే అది శనివారం రాత్రి చనిపోయింది. దాని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మొదట పెద్దఎత్తున శవయాత్ర నిర్వహించారు.
ఆ కార్యక్రమానికి వేల మంది ప్రజలు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్.. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా అక్కడికి పోలీసుల్ని తరలించారు. 15 మందిపై కేసు నమోదు చేశారు. అంత్యక్రియలకు హాజరైన అందరికీ కరోనా పరీక్షలు చేశారు.
ఇదీ చదవండి:తహశీల్దార్ నాగిని డ్యాన్స్.. లాక్డౌన్ నిబంధనలు బేఖాతర్