కొవిడ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతుండటం వల్ల కఠిన నిబంధనలు అమలు చేస్తోంది కేరళ. ఈ క్రమంలో ఈనెల 24, 25తేదీల్లో (శని, ఆదివారాలు) సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. దీనికి కూడా జూన్ 12,13 తేదీల్లో విధించిన లాక్డౌన్ మార్గదర్శకాలే వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం మూసివేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.
'ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్'
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు కేరళ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. అంతకు ముందు రోజున.. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్ పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
సంపూర్ణ లాక్డౌన్
ఈ నెల 23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్ నమూనాలను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడో రోజు సగటు పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:అప్పటివరకు ఎర్రకోట బంద్- కారణమిదే..