తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Thieves killed old woman at Hayathnagar : వృద్ధురాలిని హత్య చేసి బంగారం చోరీ కేసు.. తెలిసిన వారే నిందితులు - వృద్ధురాలిని చంపి బంగారం చోరి

Thieves killed old woman stole gold in Hayathnagar : హైదరాబాద్ శివారులో వృద్దురాలిని హత్య చేసి బంగారం దోచుకెళ్లిన కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ఇందులో నిందితులు ఇద్దరూ వృద్ధురాలు సత్తెమ్మకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులుగా పోలీసులు తెలిపారు. ఇరువురిని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 23 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Thieves killed old woman
Thieves killed old woman

By

Published : Jun 5, 2023, 4:05 PM IST

Updated : Jun 5, 2023, 11:00 PM IST

Thieves killed old woman stole gold in Hyderabad : హయత్ నగర్ పరిధిలోని తొర్రూర్​లో సత్తెమ్మ అనే వృద్దురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన కేసులో హయత్​నగర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు ఎండ్ల రాకేష్, గుండపాటి లలితలను అరెస్ట్ చేసి వారిని రిమాండ్​కు తరలించారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రధాన నిందితుడు నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన రాకేష్‌ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం నారాయణ పేట్​లోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో క్యాషియర్​గా పనిచేశాడు.

ఏడాదిన్నర క్రితం నుంచి తొర్రూర్​లోని తన సోదరుడు చంద్రశేఖర్ ఇంట్లో ఉంటున్నాడు. నిర్మాణంలో ఉన్న తన సోదరుడు ఇంటి వద్ద పనికి వచ్చే లలిత అనే మహిళతో రాకేష్​కు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. లలిత మృతురాలు సత్తెమ్మ ఇంట్లో అద్దెకు ఉంటుంది. తరచూ రాకేశ్ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండటంతో మృతురాలు సత్తెమ్మకి కూడా పరిచయం అయ్యాడు. ఆమెకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుండటంతో వృద్దురాలికి రాకేష్​తో నమ్మకం ఏర్పడింది. మృతురాలు సత్తెమ్మ తన బంధువుల పెళ్లికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బంగారు ఆభరణాలు ధరించి ఉండటం గమనించారు.

నిందితురాలు లలిత

అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆభరణాలు తొలగించాలని పథకం వేశారు. ఆదివారం రాత్రి సత్తెమ్మ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా రాకేష్ ఆమె ఇంట్లోకి ప్రవేశించి దాక్కున్నాడు. అతను ఒక గంట వరకు వేచి ఉన్నాడు. తరువాత మృతురాలు పడక గదిలోకి వచ్చి ఆమె మంచం మీద నిద్రపోతుంది. ఇదే అదునుగా భావించి రాకేష్.. పక్క గది తలుపు తీసి లలితను పిలిచి ముఖంపై ఒక దిండు వేసి గట్టిగా నొక్కాడు. లలిత వృద్దురాలి కాళ్లు పట్టుకుంది. అనంతరం ఆమె చనిపోయిందని నిర్ధారించుకొని ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు.

ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి అనుమానితులను ప్రశ్నించారు. ఇందులో నిందితురాలుగా ఉన్న లలిత పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమె సెల్​ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారించారు. దీంతో ఆమె తప్పు ఒప్పుకొంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. రాకేష్​తో పాటు లలితను అరెస్ట్ చేసి 23 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

"వృద్ధురాలు సత్తెమ్మ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించాం. నిందితులు ఆమె ఇంట్లో అద్దెకుంటున్న లలిత, పక్కింటి యువకుడు రాకేష్​గా గుర్తించాం. రాకేష్​ తరుచూ సత్తెమ్మ ఇంటికి వస్తు ఉండేవాడు. బంగారం కోసమే సత్తెమ్మను హత్య చేశారు. నిందితుల నుంచి 23 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం."- సాయి శ్రీ, డీసీపీ ఎల్బీనగర్

వృద్ధురాలిని హత్య చేసి బంగారం చోరీ కేసు.. తెలిసిన వారే నిందితులు

ఇవీ చదవండి:

Last Updated : Jun 5, 2023, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details