తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దొంగకు మస్కా కొట్టిన గజదొంగలు.. ఒకడు చోరీ చేసిన సొమ్ముతో ఇద్దరు పరార్ - కిరాణా షాపులో దొంగతనం

ఓ దొంగ చోరీ చేసిన సొమ్మును మరో ఇద్దరు దొంగలు దోచుకెళ్లారు. ఈ విచిత్ర ఘటన గుజరాత్​లో జరిగింది. ఈ సన్నివేశం అంతా సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్​ అయింది.

Another thief stole from thie
దొంగ వద్ద మరో దొంగ చోరి

By

Published : Dec 31, 2022, 10:49 PM IST

ఓ దొంగకు మరో ఇద్దరు దొంగలు మస్కా కొట్టారు. ఒకడు చోరి చేసిన సొమ్మును మరో ఇద్దరు గజదొంగలు ఎత్తుకెళ్లారు. గుజరాత్​​లోని సూరత్​లో ఈ ఘటన జరిగింది. ఈ సన్నివేశం అంతా సీసీటీవీలో రికార్డ్​ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింబాయత్‌లోని ప్రతాప్‌నగర్​కు చెందిన నూర్​ జాన్ ముహమ్మద్ షేక్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో ఈ దొంగతనం జరిగింది. షుగర్‌నగర్ సమీపంలో ఈ కిరాణా దుకాణం ఉంది. మొదట షాపులోకి ప్రవేశించిన ఓ దొంగ.. కొంత సామానును మూటగట్టుకున్నాడు. అనంతరం షాపులో ఉన్న రూ.70వేలను తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు.

దొంగ నుంచి సొమ్ము లాక్కుంటున్న మరో ఇద్దరు దొంగలు

అదే సమయంలో షాపు బయటే ఉన్న మరో ఇద్దరు దొంగలు.. చోరీ చేసి ఎత్తుకెళుతున్న రూ.70వేలను మొదటి దొంగ నుంచి లాగేసుకున్నారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైయింది. ఉదయం వచ్చి షాపును చెక్ చేసిన యజమాని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తాను బ్యాంకులో డిపాజిట్​ చేయాలనుకున్న సొమ్మును.. దొంగలు చోరీ చేశారని షాపు ఓనర్ వాపోయాడు.

ABOUT THE AUTHOR

...view details