కొవిడ్ మహమ్మారిపై భారత్ జరుపుతున్న పోరులో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలుస్తామంటూ ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయా దేశాలు వెల్లడించాయి. కరోనా రెండో దశ విజృంభణతో భారత్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన పలు దేశాలు వీలైన సాయం అందించడానికి కృషి చేస్తామని ప్రకటించాయి.
‘‘భారత్‌లో పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయి. నా ఆలోచనలన్నీ భారత మిత్రులపైనే ఉన్నాయి. ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేలా భారత్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. సాయం చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం’’
- జెన్ సాకి, శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ
‘‘భారత్ మాకు గొప్ప భాగస్వామి. ఆ దేశానికి ఎలా సహాయపడగలం, ఏం చేయగలమో చూస్తున్నాం. వెంటిలేటర్లు, ఔషధాల వంటివి పంపే ప్రయత్నం చేస్తాం’’
-బోరిస్ జాన్సన్- బ్రిటన్ ప్రధాని
‘‘కొవిడ్ రెండో దశ విజృంభణ నేపథ్యంలో భారత ప్రజలకు నా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా. మీరు చేస్తున్న పోరాటంలో ఫ్రాన్స్ అండగా ఉంది. ఏ రకమైనా సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’’
- ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
‘‘కరోనాపై పోరాటం చేస్తున్న భారత మిత్రులకు నా సంఘీభావం. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపిన భారతదేశ దాతృత్వం, నాయకత్వం ప్రశంసనీయం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తాం’’