తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ - కరోనా టీకా పంపిణీ

కరోనా వాక్సినేషన్ ప్రారంభించినప్పటి నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 16,04,18,105 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 18-44 ఏళ్లలోపు వారిలో 2,29,999 మంది లబ్ధిదారులకు మంగళవారం.. టీకా మొదటి డోసు ఇచ్చినట్లు తెలిపింది.

VACCINE
కరోనా టీకా

By

Published : May 5, 2021, 5:31 AM IST

దేశంలో మొత్తం కరోనా డోసుల పంపిణీ 16 కోట్లు దాటింది. మంగళవారం(రాత్రి 8 గంటల వరకు) దాదాపు 11.5 లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వాక్సినేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 16,04,18,105 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. 18-44 ఏళ్లలోపు వారిలో 2,29,999 మంది లబ్ధిదారులకు మంగళవారం.. టీకా మొదటి డోసు ఇచ్చినట్లు తెలిపింది. 18-44 ఏళ్లలోపు వయస్సు వారిలో మొత్తం 6,62,619 మందికి మొదటి డోసు ఇచ్చినట్లు వెల్లడించింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోఈ లబ్ధిదారులు ఉన్నారని వివరించింది.

ఇదీ చదవండి:వాట్సాప్​తో వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details