కేరళలో వరుసగా రెండోసారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్. పినరయి విజయన్ మే20న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కరోనా కారణంగా 2 వేల మంది అతిథులకు మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతి ఉంది.
ఆయనతో పాటు సీపీఎం, సీపీఐ ఇంకా కూటమిలోని పార్టీలనుంచి కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమి అంతర్గత చర్చల అనంతరం.. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు.