తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లోని ఆ ట్రాక్​ ఇప్పటికీ బ్రిటిషర్లదే.. రూ.కోటి అద్దె కడుతున్న రైల్వే శాఖ

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వేస్​కు.. దేశంలోనే అద్దె కట్టే ఓ రైల్వే లైన్ ఉంది. ఈ లైన్​పై రైలును నడిపినందుకు ఇప్పటికీ బ్రిటిషర్లకు రూ.కోటి కడుతోంది భారతీయ రైల్వే. ఆ రైల్వే లైన్ ఎక్కడ ఉందంటే?

only rail line in India the country does not own
only rail line in India the country does not own

By

Published : Mar 12, 2023, 6:50 PM IST

గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ రైల్వే శాఖోపశాఖలుగా విస్తరించింది. కొత్త లైన్లు, రైళ్లు వేస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది ఇండియన్ రైల్వేస్. భారత దేశం నలుమూలలా లైన్లను విస్తరించి.. తన ఆధీనంలో పెట్టుకున్న భారతీయ రైల్వే.. ఇప్పటికీ ఒక లైన్​పై రైలును నడిపింనందుకు అద్దెను కడుతోంది. మనదేశంలో భారతీయ రైల్వేకు చెందినది కాకుండా ప్రైవేట్​ లైన్​ ఉందా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ లైన్​ కథ తెలుసుకోవాల్సిందే..!

మహారాష్ట్రలోని యవత్మాల్​-ముర్తిజాపుర్​ మధ్య ఉన్న రైల్వే లైన్​ను బ్రిటిష్​ పాలకులు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా.. ఆ లైన్​ మాత్రం ఇంకా వారి ఆధీనంలోనే ఉంది. 1952లో రైల్వేలు జాతీయీకరణ సమయంలో ఈ లైన్​ను మరిచిపోయారు అధికారులు. ఫలితంగా ఆనాటి నుంచీ బ్రిటిషర్లకు రూ.కోటి కడుతోంది భారతీయ రైల్వే.

కిల్లిక్ నిక్సాన్ అనే బ్రిటిష్ కంపెనీ 1910లో శాకుంతల రైల్వేను స్థాపించింది. యవత్మాల్​-ముర్తిజాపుర్​ మధ్య లైన్​ను 1921లో శంకుస్థాపన చేయగా.. 1923లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మాంచెస్టర్​ నుంచి జెడీ స్టీమ్ ఇంజిన్​ను తెప్పించారు. 70 ఏళ్ల సుధీర్ఘ కాలం పాటు సేవలందించిన తర్వాత.. దీనికి 1994 ఏప్రిల్ 15న డీజిల్​ మోటార్​ను బిగించారు. 190 కిలోమీటర్ల పొడవు గల నారో గేజ్ లైన్​ను శాకుంతల రైల్వేస్​ నిర్వహిస్తోంది. బ్రిటిష్​ పాలనలో ది గ్రేట్​ ఇండియన్​ పెనిన్సులర్​ రైల్వే ఆధ్వర్యంలో సెంట్రల్​ ఇండియా మొత్తం రైళ్లను నడిపేది. మొదటగా ఈ నారో గేజ్​ను వ్యాపార ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు బ్రిటిష్​ పాలకులు. ఆ తర్వాత ప్రజా రవాణ కోసం వినియోగిస్తోంది భారతీయ రైల్వే. ఆ రోజుల్లో యావత్మాల్​లో పండే నాణ్యమైన పత్తిని ముంబయికి తరలించేందుకు ఈ లైన్​ను నిర్మించారు. అక్కడి నుంచి ఇంగ్లాండ్​లోని మాంచెస్టర్​కు తరలించేవారు.

ప్రస్తుతం ఈ రైల్వే లైన్​ అమరావతి జిల్లాలోని నిరుపేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 20 గంటల పాటు సాగే ఈ ప్రయాణానికి రూ.150 టికెట్​ ధరగా పెట్టింది రైల్వే. సిగ్నలింగ్​, టికెట్ల విక్రయం, క్యారేజీల నుంచి ఇంజిన్ వేరు చేసేందుకు ఈ లైన్​లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. నారో గేజ్​గా ఉన్న యావత్మాల్​- ముర్తిజాపుర్​ రైల్వే మార్గాన్ని బ్రాడ్ గేజ్​గా మార్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం ఆనాటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రూ. 1,500 కోట్లను కేటాయించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details