తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గడ్చిరోలి ఎన్​కౌంటర్​లో కొత్త ట్విస్ట్- టాప్​ కమాండర్​ హతం - గడ్చిరోలి ఎన్​కౌంటర్​లో 26 మంది మృతి

ఛత్తీస్​గఢ్​ మహారాష్ట్ర సరిహద్దులోని గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఈనెల 19న జరిగిన ఎన్​కౌంటర్​లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 27కి చేరింది. తాజాగా నక్సల్​ కమాండర్​ సుఖ్​లాల్​ పర్చాకీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

gadchiroli encounter
పోలీసులు ఎన్​కౌంటర్

By

Published : Nov 16, 2021, 6:24 PM IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్​కు సంబంధించి మంగళవారం మరో మృతదేహం బయటపడింది. దీంతో ఎన్​కౌంటర్​లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 27కి చేరింది. మృతుడ్ని నక్సల్​ కమాండర్​ సుఖ్​లాల్​ పర్చాకీ (33)గా పోలీసులు గుర్తించారు. సుఖ్​లాల్​పై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈనెల 19న ఛత్తీస్​గఢ్​ మహారాష్ట్ర సరిహద్దులోని గ్యారపట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది నక్సల్స్​ హతమైనట్లు అధికారులు తొలుత ప్రకటించారు. మృతుల్లో భీమా కోరేగావ్‌ అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మావోయిస్టు నేత మిలింద్‌ తెల్‌తుంబ్డే సహా పలువురు కీలక నేతలు ఉన్నారు.

ఇదీ చూడండి :5 వేల మందికి పురుడు పోసిన నర్స్​.. తన వరకు వచ్చే సరికి... పాపం...

ABOUT THE AUTHOR

...view details