తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాటేసిన పామును పట్టుకుని ఆసుపత్రికి.. - Viral video

కాటేసిన తాచు పామును పట్టుకుని ఆసుపత్రికి వచ్చాడో వ్యక్తి. ఇది చూసి డాక్టర్​ షాకయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జరిగింది.

cobra
కాటేసిన తాచుపాముతో ఆసుపత్రికి

By

Published : Jun 13, 2021, 6:18 PM IST

కాటేసిన తాచుపాముతో ఆసుపత్రికి బాధితుడు

కాటేసిన తాచుపామును పట్టుకుని ఓ వ్యక్తి ఆసుపత్రికి వచ్చాడు. దీంతో వైద్యుడు షాకయ్యాడు. ఈ ఘటన కర్ణాటక బళ్లారి జిల్లా ఉప్పరహళ్లి గ్రామంలో జరిగింది.

కడప్ప అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా.. తాచుపాము అతని ఎడమ చేతిపై కాటేసింది. దాంతో వెంటనే పామును చేతితో పట్టుకుని, బంధువు​ సాయంతో స్థానిక ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు అతడ్ని కాంప్లీ ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడి వైద్యులు అతనికి ప్రథమ చికిత్స చేసి.. జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. జిల్లా ఆసుపత్రికి కూడా పామును పట్టుకునే వెళ్లాడు కడప్ప. బళ్లారి ఆసుపత్రి వద్ద కొందరు ఆ పామును కొట్టి చంపారు.

బాధితుని మానసిక పరిస్థితి బాగోలేనందునే పామును చేతితో పట్టుకుని వెళ్లాడని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:కాలిన గాయాలతో తల్లి.. సాయానికి బాలుడి వినతి

ABOUT THE AUTHOR

...view details