మహారాష్ట్ర హింగోలీ జిల్లా గోరేగావ్ మండలం తక్తోడా గ్రామానికి చెందిన ఆ రైతు కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆరవ తరగతి చదువుతున్న చిముర్ది తన కుటుంబ పరిస్థితులను వివరిస్తూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
ఒక్క లేఖతో చిన్నారి కుటుంబంలో 'దీపావళి' వెలుగులు - hingoli district little girl letter to cm news
కరోనా కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది ఓ చిన్నారి. అంతేకాక తన తండ్రి ఆర్థిక పరిస్థితి వల్ల దీపావళి పండుగను జరుపుకోలేకపోతున్నామని లేఖలో తన ఆవేదనను తెలిపింది. బాలిక రాసిన లేఖ వైరల్గా మారటంతో జిల్లా పోలీస్ అధికారులు స్పందించి నిత్యావసరాలు, నగదుతోపాటు స్వీట్లు,టపాసులు అందించారు.
ఒక్క లేఖతో చిన్నారి కుటుంబంలో 'దీపావళి' వెలుగులు
'ఆర్థిక పరిస్థితుల కారణంగా దీపావళి పండగకు టపాసులు తేలేనని తన తండ్రి అన్నార'ని చిన్నారి లేఖలో తెలిపింది. బాలిక రాసిన లేఖ వైరల్ అయ్యి జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా ఎస్పీ రాకేష్ కలసాగర్ ఆధ్వర్యంలో చిన్నారి కుటుంబాన్ని గుర్తించారు. వారికి నిత్యావసరాలు, వస్త్రాలు, నగదు, స్వీట్లు, టపాసులు అందించారు.