తెలంగాణ

telangana

By

Published : May 2, 2022, 3:37 PM IST

ETV Bharat / bharat

'ఆ రాష్ట్రంలోని 'మా ప్రాంతాల'ను ఎలా తెచ్చుకోవాలో చూస్తాం!'

Karnataka CM: కర్ణాటకకు చెందిన అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై. మరాఠీ మాట్లాడే గ్రామాలు ఇంకా కర్ణాటకలో ఉండటం బాధాకరమని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్​ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

bommai-taunts-maha-dcm
అజిత్​ పవార్​ వ్యాఖ్యలకు సీఎం బొమ్మై కౌంటర్​

CM Bommai News: కర్ణాటక సరిహద్దులో మరాఠీలున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్ చేసిన వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు కన్నడ సీఎం బసవరాజ్ బొమ్మై. తమ రాష్ట్రంలోని అంగుళం భూభాగాన్ని కూడా పోనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సరిహద్దు అంశం ఇప్పటికే స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.

మహారాష్ట్రలోనూ కన్నడ మాట్లాడే ప్రాంతాలున్నాయని, వాటిని ఎలా కర్ణాటకలో కలపాలని ఆలోచిస్తున్నామని బొమ్మై పేర్కొన్నారు. కొందరు తమ రాజకీయ మనుగడ కోసం భాషలు, ప్రాంతాలు వంటి అంశాలను లేవనెత్తుతారని ఘాటు విమర్శలు చేశారు. ఇలాంటి ట్రిక్స్​ ఉపయోగించి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకోవడం సరికాదన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఉందని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ఇలాంటి సరిహద్దు అంశాలను తెరపైకి తెస్తోందని బొమ్మై ధ్వజమెత్తారు.

Ajit Pawar News: మహారాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్​. మరాఠీ మాట్లాడే పలు గ్రామాలు సహా బెల్గాం, నిపాయ్​, కర్వార్ వంటి ప్రాంతాలు కర్ణాటకలో భాగమై ఉండటం బాధాకరం అన్నారు. తమను మహారాష్ట్రలో కలపాలని అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మద్దతుగానే ఉంటుందని పేర్కొన్నారు. ఈ వాఖ్యలపైనే కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై ఘాటుగా స్పందించారు.

ఇదీ చదవండి:ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్! టార్గెట్​ 2024!!

ABOUT THE AUTHOR

...view details