ప్రకృతి అందాలకు నెలవైన కర్ణాటక శృంగేరిలో నిర్వహిస్తున్న 'ఆఫ్-రోడ్ జీప్ రేసు'కు విశేష ఆదరణ లభిస్తోంది. కాఫీ పొలాలు, అడవులు, కొండలు, బురద, చెరువుల మధ్యలో 'శృంగేరీ అడ్వెంచర్ అండ్ మోటార్ క్లబ్' నిర్వహంచే 'మాల్నాడ్ థ్రిల్స్ ఫన్ డ్రైవ్'లో 50మందికిపైగా రైడర్లు పాల్గొన్నారు.
ఈ రేసును శృంగేరి పరిసర గ్రామాల్లోనే నిర్వహిస్తున్నారు. దీనిలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కేరళ నుంచి కూడా రైడర్లు వస్తున్నారు. సాధారణంగా చిక్కమగళూరు జిల్లాలో ఇలాంటి పోటీలు తరచుగా జరుగుతుంటాయి. సాహసోపేత రైడర్స్ చాలా మంది ఈ రైడ్‌ను ఆస్వాదిస్తారు.