తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరంబీర్​ సింగ్​పై నాన్​ బెయిలబుల్​ వారెంట్​ రద్దు

ముంబయి మాజీ పోలీసు కమిషనర్​ పరంబీర్​ సింగ్​పై(param bir singh mumbai) జారీ చేసిన నాన్​ బెయిలబుల్​ వారెంట్​ను ఠాణే కోర్టు రద్దు చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని పరంబీర్​ను ఆదేశించింది.

param bir singh news, పరంబీర్​ సింగ్​
పరంబీర్​ సింగ్​పై నాన్​ బెయిలెబుల్​ వారెంట్​ రద్దు

By

Published : Nov 26, 2021, 4:14 PM IST

param bir singh bail news: బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్‌పై జారీ చేసిన నాన్​ బెయిలబుల్​ వారెంట్​ను మహారాష్ట్ర ఠాణే కోర్టు రద్దు చేసింది. విచారణ కోసం కోర్టు ఎదుట పరమ్​బీర్​ హాజరుకావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. రూ. 15వేల వ్యక్తిగత బాండు సమర్పించాలని స్పష్టం చేసింది.

ఠాణె కోర్టు ఎదుట హాజరైన పరమ్​బీర్​
పరమ్​బీర్​ సింగ్​

బలవంతపు వసూళ్ల కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్‌ గురువారం ముంబయిలో ప్రత్యక్షమయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తునకు సహకరించేందుకుగాను చండీగఢ్‌ నుంచి ఆయన వచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ముంబయి విమానాశ్రయం నుంచి నేరుగా నేర విభాగం కార్యాలయానికి వెళ్లిన పరమ్‌బీర్‌ సింగ్‌ నుంచి గోరెగావ్‌ ఠాణాలో నమోదైన బలవంతపు వసూళ్ల కేసులో వాంగ్మూలం తీసుకున్నారు అధికారులు.

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్​యూవీ నిలిపివేత, వ్యాపారవేత్త మన్‌సుఖ్​ హిరేన్‌ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర సర్కార్‌ బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఈ ఏడాది మే తర్వాత ఒక్కసారి కూడా ఆఫీస్​కు వెళ్లలేదు(parambir singh mumbai police).

ఇదీ చూడండి:-'లేఖ'పై మహా​లో ప్రకంపనలు- పవార్​ కీలక భేటీ!

ABOUT THE AUTHOR

...view details