తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైదరాబాద్​లో ఉగ్రవాదుల రెక్కీ... ఆ​ రైల్వే స్టేషన్​లో బాంబులు! - హైదరాబాద్ ఉగ్రవాదులు హరియాణా అరెస్టు

Terrorists recce in Hyderabad: హైదరాబాద్​ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన ఉగ్రవాదులను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. వీరు నాందేడ్​లో నాలుగు రోజుల పాటు ఉన్నారని వెల్లడించారు. మరోవైపు, నాగ్​పుర్ రైల్వే స్టేషన్​లో పేలుడు పదార్థాలు బయటపడటం కలకలం రేపుతోంది.

Terrorists recce in Hyderabad
Terrorists recce in Hyderabad

By

Published : May 10, 2022, 7:39 PM IST

Terrorists recce in Hyderabad: మహారాష్ట్రలోని నాందేడ్​, తెలంగాణలోని హైదరాబాద్​లో రెక్కీ నిర్వహించిన ఉగ్రవాదులను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు వీరు నాందేడ్​లో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి బీదర్ మీదుగా గోవాకు వెళ్లారని వెల్లడించాయి. వీరంతా ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్​స్టర్ హర్విందర్ సింగ్ రింధా అనుచరులు అని పోలీసులు చెబుతున్నారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలను నాందేడ్​కు తరలించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఉగ్రవాదులు నాందేడ్, హైదరాబాద్​తో పాటు బీదర్, గోవాలోనూ తిరిగారని పోలీసులు తెలిపారు. అయితే, నాందేడ్​పైనే వీరు స్పెషల్ ఫోకస్ పెట్టారని స్పష్టం చేశారు. దీన్ని బట్టి వీరంతా హర్విందర్ సింగ్ రింధా అనుచరులేనని పోలీసులు స్పష్టతకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నాందేడ్​లో హైఅలర్ట్ ప్రకటించారు. రింధాకు సంబంధించిన స్థలాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అతడి అనుచరులపై నిఘా పెట్టారు. ఇదివరకు అరెస్టు అయి బెయిల్​పై విడుదలైన అతడి అనుచరుల వివరాలు సేకరిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా అనేక ప్రదేశాల్లో ఆయుధాలు లభించినట్లు సమాచారం. అయితే, నాందేడ్​లో పేలుడు పదార్థాలు అమర్చాలన్నది ఉగ్రవాదుల ప్రణాళిక కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని నాందేడ్ డివిజన్ ఐజీ నిసార్ తంబోలీ పేర్కొన్నారు. నాందేడ్ పోలీసులు, హరియాణా పోలీసులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Nagpur railway station bomb: మరోవైపు, మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో పేలుడు పదార్థాలు కనిపించడం కలకలం రేపింది. నాగ్​పుర్ రైల్వే స్టేషన్​లో ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్​పీఎఫ్), బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. బ్యాగులో 54 డిటోనేటర్లు, స్వల్ప తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు లభించాయని నాగ్​పుర్ పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు.

నాందేడ్ పోలీస్ స్టేషన్​లో లభించిన పేలుడు పదార్థాల పరికరాలు

ABOUT THE AUTHOR

...view details