తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోకి అఫ్గాన్ ఉగ్రవాదులు.. దాడులకు భారీ కుట్ర! - జమ్ముకశ్మీర్ ఉగ్రకుట్ర

పండుగ సీజన్‌కు ముందు దేశం​లో భారీ ఉగ్రదాడులు(Terrorist Attack in India) జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు(Intelligence Agency) హెచ్చరికలు జారీ చేశాయి. పాక్ ఆధారిత ఉగ్ర సంస్థల(Terrorism in Pakistan) సహాయంతో అఫ్గానిస్థాన్​కు చెందిన ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్​లోకి చొరబడి దేశవ్యాప్తంగా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి.

Terror
Terror

By

Published : Sep 23, 2021, 5:18 PM IST

రాబోయే పండగ సీజన్‌లో దేశంలో భారీ ఉగ్రకుట్రలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు (Intelligence Bureau of India)హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు అఫ్గాన్​కు చెందిన ముష్కరులు సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.

ఈ మేరకు లష్కర్-ఏ-తొయిబా(Lashkar-e-Taiba), హర్కత్ ఉల్-అన్సార్ (హువా), హిజ్బుల్ ముజాహిద్దీన్(Hizbul Mujahideen) కదలికలకు సంబంధించి పక్కా సమాచారం అందినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. 'అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(Afghan Taliban) స్వాధీనం చేసుకున్న తరువాత ఐఎస్ఐ మద్దతుతో అఫ్గాన్ ముష్కరులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం అందింది' అని నిఘా అధికారి ఒకరు వెల్లడించారు.

టిఫిన్​ బాంబుల తయారీ..

నియంత్రణ రేఖ(Line of Control) వెంబడి పాకిస్థాన్‌ నక్యాల్ సెక్టార్‌లోని ఉగ్రక్యాంపులో దాదాపు 40 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. వీరంతా పూంచ్ నది ద్వారా భారత్​లోకి ప్రవేశించేలా శిక్షణ పొందారని పేర్కొన్నాయి.

'పండగల సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులకు టిఫిన్ బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చినట్లు మాకు సమాచారం అందింది. భారత్​లో యాక్టివ్‌గా(Active Terrorist Groups) ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా టిఫిన్ బాంబుల తయారీకి కావలసిన ముడిసరుకు అందుతుంది' అని నిఘా వర్గాలు వివరించాయి. ఈ సమాచారంపై పారామిలిటరీ, రాష్ట్ర పోలీసులతో పాటు సంబంధిత ఏజెన్సీలను నిఘా ఏజెన్సీ అప్రమత్తం చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details