తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘోర ప్రమాదం.. కారులో ఐదుగురు సజీవదహనం - పంజాబ్​లో రోడ్డు ప్రమాదం

పంజాబ్​లోని సంగూర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు సజీవదహనం అయినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా స్థానికంగా జరిగిన వివాహ వేడుకకు హజరై తిరిగి వెళ్తుండగా ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

Terrible road accident in Sangrur, 5 people burnt alive in car
ఘోర రోడ్డు ప్రమాదం-ఐదుగురు సజీవదహనం

By

Published : Nov 17, 2020, 12:16 PM IST

పంజాబ్​లోని సంగూర్​లో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. పెళ్లి వేడుకకు హాజరైన వారు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న డీజిల్​ ట్యాంక్​ను ఢీకొట్టగా మంటలు చెలరేగాయి. కారులోని వారు బయటకు రావడానికి వీలు లేకుండా పోవడం వల్ల వారంతా అక్కడికక్కడే మృతి చెందారు.

పూర్తిగా కాలిపోయిన కారు
దెబ్బతిన్న కారు
కారు ఢీ కొట్టిన డీజల్​ ట్యాంక్​

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు బంధువులకు సమాచారం అందించారు.

ఇదీ చూడండి: దీపావళి వేడుకల్లో భాజపా ఎంపీ మనవరాలు మృతి

ABOUT THE AUTHOR

...view details