తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేయసితో పదో తరగతి విద్యార్థి పరార్.. ఊరంతా టెన్షన్​ టెన్షన్ - 10 boy for eloping with classmate

tenth class students elope: పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. అదే తరగతికి చెందిన అమ్మాయిని తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు.. తమిళనాడులో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

elope in lovers
పారిపోయిన ప్రేమ జంట

By

Published : Mar 14, 2022, 5:09 PM IST

tenth class students elope: పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు.. అదే క్లాసు అమ్మాయిని తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ జిల్లాలో జరిగింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. నిందితుడిపై అపహరణ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

మైనర్​లు ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలిక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

కీచక ఉపాధ్యాయుడు..

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ కీచక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులోని మదురై సమీపంలోని మేలూర్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: గర్భం దాల్చిందని పెళ్లి.. అది వద్దన్నందుకు భార్యపై హత్యాయత్నం!

ABOUT THE AUTHOR

...view details