ఓ పదేళ్ల అమ్మాయి రోడ్డు మీద బట్టలు అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తోంది. చిన్న తనంలో తన వాళ్ల భారాన్ని భుజాలకెత్తున్న ఆమెకు సాయంచేయడానికి పలువురు ముందుకు వస్తున్నారు. ఇంత చిన్నతనంలో ఆమెకు ఇంత కష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్ ఖీర్నీ బాగ్కు చెందిన ప్రదీప్ సక్సేనా అనే వ్యక్తి ఏప్రిల్ 30న కరోనాతో మృతి చెందాడు. వృద్ధ తల్లిదండ్రులు, భార్యా పిల్లలకు ఆయనే పెద్ద దిక్కు. రోడ్ల మీద బట్టలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. దీంతో తన పదేళ్ల కూతురు మహి.. కుటుంబ పోషణ బాధ్యతను తలకెత్తుకుంది. రోజూ రోడ్లమీద బట్టలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. బట్టలు అమ్మితేనే వారికి తిండి..లేకుంటే అంతే.