తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2021, 1:19 PM IST

ETV Bharat / bharat

ఆ పూజారిని దేవుడిలా కొలుస్తున్న జనం

ఓ ఆలయ పూజారి మరణానంతరం.. ఆయనకు గుడి కట్టించారు స్థానికులు. అర్చక వృత్తి చేస్తూనే, ప్రజలకు చేసిన సేవకు కృతజ్ఞతగా ఆలయాన్ని నిర్మించారు. ఘనంగా కుంభాభిషేకం కూడా నిర్వహించారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటే?

Temple built for a priest
మరణానంతర పూజారికి గుడి కట్టిన ప్రజలు

పూజారికి గుడి కట్టిన స్థానికులు

లాక్​డౌన్​లో వలసకూలీలకు సాయం చేసిన సోనూసూద్​కు కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రజలు పూజలు చేశారు. అలాంటి సంఘటనే తమిళనాడు దిండిగల్ జిల్లాలో జరిగింది. బతికున్నప్పుడు ప్రజలకు చేసిన సేవకు కృతజ్ఞతగా.. ఓ పూజారికి గుడి కట్టారు స్థానికులు.

మరణానంతరం పూజారికి గుడి కట్టిన ప్రజలు

ఎవరాయన.. ఎందుకు గుడి కట్టారు?

ఈయన పేరు నటరాజన్​. దిండిగల్​ జిల్లా లక్ష్మీపురంలోని బట్లగుండు సమీపంలో ఉన్న కలియుగ చిదంబరేశ్వర ఆలయంలో పూజారిగా పని చేసేవారు. తన జీవితాన్ని ఆలయానికి అంకితం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ గతేడాది జులై 14న ఈయన మృతి చెందారు. దిగ్భ్రాంతికి గురైన గ్రామస్థులు.. ఆయన సేవకు కృతజ్ఞతగా గుడి కట్టాలని నిర్ణయించారు. తమకు తగిన స్థాయిలో ఆర్థిక సాయం చేసి.. గుడి నిర్మించారు.

కుంభాభిషేకం నిర్వహిస్తున్న స్థానికులు

నటరాజన్​ తొలి వర్ధంతిని వేడుకలా నిర్వహించి.. బుధవారం కుంభాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

నటరాజన్ తండ్రి పేరు చిదంబరం. ఆయన పేరు మీదే.. ఆ గ్రామానికి పుసారిపట్టి.. అంటే పూజారి గ్రామం అనే అర్థం వచ్చేలా పేరు పెట్టారు. చిదంబరం మరణానంతరం.. నటరాజన్​ అర్చక బాధ్యతను స్వీకరించారు.

వేడుకల్లో పాల్గొన్న ప్రజలు
కుంభాభిషేకం చేస్తున్న ప్రజలు

కలియుగ చిదంబరేశ్వర ఆలయం దాదాపు 2,000 ఏళ్ల నాటిది. ఈ ఆలయంలో తమిళనాడులోనే రెండో అతిపెద్ద నంది విగ్రహం ఉండటం విశేషం.

వేడుకల్లో పాల్గొన్న ప్రజలు

ఇదీ జరిగింది:ఏడాదిలో 300 రోజులు పూర్తిగా నిద్రపోతూ...

ABOUT THE AUTHOR

...view details