Telangana Ministers Portfolios Circulated in Social Media : తెలంగాణలో కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. అయితే అదంతా ఫేక్ న్యూస్ అని ఇప్పటి వరకు శాఖల కేటాయింపు జరగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే అధికారికంగా శాఖల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశాయి.
తెలంగాణ మంత్రులకు శాఖ కేటాయింపు - సోషల్ మీడియాలో అసత్య ప్రచారం - తెలంగాణ మంత్రులకు శాఖ కేటాయింపు
Telangana Ministers Portfolios Circulated in Social Media : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎంగా రేవంత్ రెడ్డి, 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త మంత్రులకు సీఎం శాఖలు కేటాయించినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ఎలాంటి శాఖల కేటాయింపు జరగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదంతా ఫేక్ అని స్పష్టం చేశాయి.
తెలంగాణ మంత్రులకు శాఖ కేటాయింపు - సోషల్ మీడియాలో అసత్య ప్రచారం
Published : Dec 7, 2023, 11:02 PM IST
|Updated : Dec 8, 2023, 6:41 AM IST
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన మంత్రులు శాఖల వివరాలు ఇవే..
- భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి
- ఉత్తమ్ కుమార్‌రెడ్డి - హోం మంత్రి
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - మున్సిపల్ శాఖ మంత్రి
- డి.శ్రీధర్‌బాబు - ఆర్థికశాఖ మంత్రి
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - నీటి పారుదలశాఖ మంత్రి
- కొండా సురేఖ - మహిళా సంక్షేమశాఖ మంత్రి
- దామోదర రాజనర్సింహ - వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
- జూపల్లి కృష్ణారావు - పౌరసరఫరాలశాఖ మంత్రి
- పొన్నం ప్రభాకర్ - బీసీ సంక్షేమశాఖ మంత్రి
- సీతక్క - గిరిజన సంక్షేమశాఖ మంత్రి
- తుమ్మల నాగేశ్వరరావు - రోడ్లు, భవనాల శాఖ మంత్రి
Last Updated : Dec 8, 2023, 6:41 AM IST