తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CM KCR: 'మారకపోతే మార్చేస్తా'.. ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

CM KCR Warning to Party MLAs: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు అంశంపై సీఎం కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. దళితబంధుపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా తన దగ్గరు ఉందని అన్నారు. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తొలగిస్తామని గట్టిగా హెచ్చరించారు.

kcr
kcr

By

Published : Apr 27, 2023, 6:22 PM IST

Updated : Apr 28, 2023, 8:01 AM IST

CM Kcr: 'డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్‌'

CM KCR Warning to Party MLAs: రాష్ట్రంలో దళితబంధు పథకం అమలు అంశంపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రతినిధుల సర్వసభ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించిన సీఎం కేసీఆర్..​ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఎమ్మెల్యేలకు ఇదే చివరి హెచ్చరిక:దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి హెచ్చరిక అని చెప్పిన ముఖ్యమంత్రి... ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పిస్తామని గట్టిగా హెచ్చరించారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యతన్నారు. రెండు పడకల గదుల ఇళ్ల విషయంలోనూ ఆరోపణలున్నాయని గుర్తుచేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిలకు ఈ సందర్భంగా సున్నిత హెచ్చరికలు జారీచేశారు.

పార్టీ కోసం కలిసి పని చేయాలి:వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా... పార్టీ కోసం కలిసి పని చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని... మిగతా నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సమస్యే ఉంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని చెప్పారు. నాయకులందరూ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని... ఎలాంటి సమస్య ఉన్నా అధిష్టానంతో విన్నవించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని చెప్పారు.

కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయని... ఇళ్ల నిర్మాణానికి యోగ్యంగా ఉంటే వెంటనే పంచేద్దామని ముఖ్యమంత్రి తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట జెడ్పీ ఛైర్‌పర్సన్లు, ఎంపీలు, జిల్లా ఇంఛార్జిలను ఉపయోగించుకుని... మూడ్నాలుగు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు 12 గంటల 45నిమిషాల వరకు అక్కడికి చేరుకోవాలని.. ఒంటి గంటా 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు మంత్రులు తమ ఛాంబర్స్‌కు వెళ్లిపోవాలని సూచించారు. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో బ్రీఫ్ మీటింగ్, లంచ్ తర్వాత డిస్పోస్ ఉంటుందని చెప్పారు. మెయిన్ గేట్ సీఎం, మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలకు ఉద్దేశించిందని... 3 గేట్లు, నార్త్ ఈస్ట్ గేట్ అధికారుల రాకపోకల కోసమని... జనరల్ విసిటర్స్‌కు సౌత్ ఈస్ట్ కేటాయించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 28, 2023, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details