తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాలూ విడుదల కోరుతూ.. రాష్ట్రపతికి 50 వేల లేఖలు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రపతికి 50వేల లేఖలు పంపారు ఆయన కుమారుడు తేజ్​ ప్రతాప్​ యాదవ్​. దేశవ్యాప్తంగా ఉన్న లాలూ అభిమానుల నుంచి ఈ లేఖలు సేకరించినట్లు చెప్పారు.

Tej Pratap Yadav
తేజ్​ ప్రతాప్​ యాదవ్

By

Published : Feb 12, 2021, 8:55 AM IST

రాష్ట్రీయ జనతా దళ్​ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రపతికి 50 వేల పోస్టుకార్డులు పంపారు లాలూ కుమారుడు, ఎమ్మెల్యే తేజ్​ ప్రతాప్​ యాదవ్. వాటిని స్వేచ్ఛా లేఖలుగా పేర్కొన్నారు తేజ్​. తన తండ్రి విడుదలయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

" బిహార్​తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లాలూ జీ అభిమానుల నుంచి ఈ లేఖలను సేకరించాం. ఆయన విడుదలయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అధ్యక్షుడిని కలిసేందుకు నాకు సమయం ఇవ్వాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు లేఖలు రాసి నాకు ఇవ్వండి.. వాటిని నేను రాష్ట్రపతికి పంపిస్తా. "​

- తేజ్​ ప్రతాప్​ యాదవ్​, ఆర్జేడీ నేత

దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్​ యాదవ్​ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. రాష్ట్ర మెడికల్​ బోర్డు సూచనల మేరకు ఇటీవలే దిల్లీలోని అఖిల భారత వైద్య మండలి (ఎయిమ్స్​)కు తరలించారు అధికారులు.

ఇదీ చూడండి:క్షీణించిన లాలూ ఆరోగ్యం-ఎయిమ్స్​కు తరలింపు

ABOUT THE AUTHOR

...view details