తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుర్రాల ఇంజక్షన్​ వేసి అమ్మాయిపై దారుణం​.. 4రోజులు బందీగా ఉంచి అత్యాచారం.. - గుర్రాల ఇంజక్షన్ వేసి అమ్మాయిని అత్యాచారం యూపీ

ఓ అమ్మాయికి కుక్కలు, గుర్రాలకు వేసే ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. అనంతరం ఆమె నగ్న వీడియోలను తీసి బ్లాక్​మెయిల్​ చేశాడు. దీంతో విసుగు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు.. కోచింగ్​ సెంటర్​ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు దుండగులు. అనంతరం వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. ఈ దారుణం ఎక్కడ జరిగిందంటే?

Teenager Raped By giving Lethal Injection
Teenager Raped By giving Lethal Injection

By

Published : Jun 9, 2023, 10:55 PM IST

ఓ అమ్మాయి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి ట్రాప్ చేశాడో వ్యక్తి. ఆ తర్వాత ​కుక్కలకు, గుర్రాలకు వేసే ఇంజక్షన్​ వేసి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు ఫజల్​గంజ్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఓ షోరూమ్​లో పనిచేస్తోంది. కిద్వాయ్​ నగర్​కు చెందిన అర్జున్​ సింగ్​ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను ఓసారి కలుద్దామని పిలిచాడు. అనంతరం ఆమెకు కుక్కలు, గుర్రాలకు వేసే ఇంజక్షన్​ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను నాలుగు రోజుల పాటు బందీగా ఉంచి.. మళ్లీ పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు నిందితుడు. ఆ దారుణాన్ని వీడియో తీసి.. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

అయితే, కొద్ది రోజుల తర్వాత కూడా ఫోన్​ చేసి తన వద్దకు రావాలని.. లేకుంటే వీడియో సోషల్ మీడియాలో వైరల్​ చేస్తానని బెదిరించేవాడు. దీంతో విసుగు చెందిన బాధితురాలు.. ఫజల్​గంజ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అయినా జూన్​ 6న మళ్లీ బాధితురాలికి వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్​ చేసి తన మాట వినకుంటే యాసిడ్ దాడికి పాల్పడతానని బెదిరించాడు. దీనిపై బాలిక తరఫు న్యాయవాది.. పోలీసు కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్​.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని చెప్పారు.

దుండగుల దాడిలో విద్యార్థిని మృతి..
బిహార్​లో దారుణం జరిగింది. కోచింగ్​ సెంటర్ నుంచి తిరిగి వస్తున్న ఇద్దరు విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు నలుగురు దుండగులు. అనంతరం వారిద్దరిపై దాడి చేశారు. అందులో ఓ విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మృతి చెందింది. మరో విద్యార్థిని అక్కడ నుంచి పారిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వైశాలి జిల్లా కర్తాహ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు కోచింగ్​ సెంటర్​ ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో దారి మధ్యలో బైక్​పై వచ్చిన నలుగురు దుండగులు వారిని అడ్డగించి లైంగికంగా వేధించారు. ప్రతిఘటించిన వారిపై దాడికి తెగబడ్డారు. దీంతో అందులోని ఓ అమ్మాయి పారిపోయి.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

ఇంతలో దుండగుల చేతుల్లో తీవ్రంగా గాయపడిన బాలిక మెదట స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత కొన్ని అడుగులేసి కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాధితురాలు మృతి చెందిందని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మైనర్​పై ఆరుగురు గ్యాంగ్​రేప్​..
మహారాష్ట్ర ఔరంగాబాద్​లో దారుణం జరిగింది. 14 ఏళ్ల మైనర్​పై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్​లో వీడియో తీసి.. బాధితురాలిని బెదిరించారు. దాదాపు ఆరు నెలల పాటు.. ఆమెను రాత్రి వేళల్లో పిలుస్తూ వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే నిందితుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details