తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు గ్రూప్​ల మధ్య ఘర్షణ- బాలుడు మృతి - ఉత్తర 24 పరగణా జిల్లా

రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ ఓ 16 ఏళ్ల బాలుడిని బలితీసుకుంది. ఈ ఘటన బంగాల్​లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగింది. బాలుడి మృతికి కారణమైన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

WB-CLASH
రెండు గ్రూపుల మధ్య వివాదం- 16 ఏళ్ల బాలుడి బలి

By

Published : Mar 3, 2021, 7:44 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ అక్కడి పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణ ఓ 16 ఏళ్ల బాలుడిని బలితీసుకుంది. ఈ ఘటన ఉత్తర 24పరగణా జిల్లాలో జరిగింది.

ఖుదీరామ్​ పల్లీలో మొదట రెండు గ్రూపుల మధ్య చిన్న గొడవ జరిగింది. క్రమేపి వారిమధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడిని కొట్టారు. తీవ్ర గాయాలైన ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన పలువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:'టీఎంసీ రాజకీయాలతో దేశ భద్రతకే ముప్పు'

ABOUT THE AUTHOR

...view details