ఇటీవలి కాలంలో తూర్పు సెక్టార్‌లో వాస్తవాధీన రేఖకు (ఎల్‌సీసీ) అతి సమీపంలో చైనా తన సైనిక శిక్షణ కార్యకలాపాలను ముమ్మరం చేయటంతోపాటు బలగాలను మోహరించినట్లు పలువురు సైనికాధికారులు వెల్లడించారు. చైనా బలగాలు(India China News) పెట్రోలింగ్ సైతం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)(India China Lac News) వెంబడి పకడ్బందీ నిఘా కోసం భారత్ ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. డ్రాగన్ (India China Latest News) అనుమానాస్పద కదలికలు, పెట్రోలింగ్‌ను నిశితంగా ట్రాక్ చేసేందుకు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక నిఘా పరికరాలను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ), ఇతర టెక్నాలజీల సాయంతో అభివృద్ధి చేసిన పరికరాలను ఇప్పటికే తూర్పుసెక్టార్‌లో ఎల్‌ఏసీ వెంబడి ఏర్పాటు చేసింది.
ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ..
ఇక్కడి 5 మౌంటెయిన్ డివిజన్ సిగ్నల్స్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ భవ్య శర్మ ఇటీవల 'ఫేస్ రికగ్నైజేషన్' సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లోని వివాదాస్పద ప్రాంతాలైన నమ్కా చు లోయ, సుమ్‌డోరోంగ్ చు తదితర ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలను ట్రాక్ చేసేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్.. ఎల్‌ఏసీకు(India China Lac News) అతి సమీపంలో వచ్చే చైనా సిబ్బందిని గుర్తించడంలో సహాయపడుతుంది.