- నంద్యాల: నిరసనలో టీడీపీ నాయకుడికి గుండెపోటు
- డోన్ పాత బస్టాండ్ వద్ద నిరసన చేపట్టిన టీడీపీ శ్రేణులు
- చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల నిరసన
- నిరసన చేస్తుండగా జిల్లా టీడీపీ కార్యదర్శి గోవింద్‌కు గుండెపోటు
- కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి గోవింద్ తరలింపు
Live Updates: చంద్రబాబు రిమాండ్ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ - protest across the state
Published : Sep 11, 2023, 6:46 AM IST
|Updated : Sep 11, 2023, 2:13 PM IST
14:11 September 11
నంద్యాల: నిరసనలో టీడీపీ నాయకుడికి గుండెపోటు
14:10 September 11
గుంటూరు అరండల్‌పేటలో తీవ్ర ఉద్రిక్తత
- గుంటూరు అరండల్‌పేటలో తీవ్ర ఉద్రిక్తత
- చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా జనసేన, ఎంఆర్‌పీఎస్ ఆందోళన
- రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన జనసేన, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు
- ఆందోళనకారులను అడ్డుకునేందుకు వైసీపీ నేతల యత్నం
- గుంటూరు: ఆందోళనకారులను లాఠీ పట్టుకుని తరిమిన మేయర్
- గుంటూరు: జనసేన, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణ
- ఆందోళనను అడ్డుకోవడంపై నిలదీసిన జనసేన శ్రేణులు
- మద్దాల గిరి రావడంతో ఆందోళన మరింత ఉద్ధృతం చేసిన నిరసనకారులు
- జనసేన, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
14:10 September 11
పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో ప్రత్తిపాటి గృహనిర్బంధం
- పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో ప్రత్తిపాటి గృహనిర్బంధం
- ప్రత్తిపాటి నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- ప్రత్తిపాటి నివాసానికి టీడీపీ శ్రేణులు రాకుండా అడ్డుకున్న పోలీసులు
- చిలకలూరిపేట కోర్టు వద్ద టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిరసన
- చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో టీడీపీ రాస్తారోకో
- గంగన్నపాలెం-ఇర్లపాడు బస్టాప్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు
14:09 September 11
గుంటూరు: అరండల్‌పేట వద్ద తీవ్ర ఉద్రిక్తత
- గుంటూరు: అరండల్‌పేట వద్ద తీవ్ర ఉద్రిక్తత
- చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో జనసేన, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తల ఆందోళన
- రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన జనసేన, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు
- జనసేన, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట
- మద్దాల గిరి రావడంతో ఆందోళన మరింత ఉద్ధృతం చేసిన నిరసనకారులు
- ఆందోళనతో రహదారిపై భారీగా నిలిచిన వాహన రాకపోకలు
14:09 September 11
సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత
- సత్యసాయి జిల్లా: హిందూపురంలో ఉద్రిక్తత
- హిందూపురంలో నల్లజెండాలతో ర్యాలీ చేపట్టిన టీడీపీ శ్రేణులు
- ర్యాలీగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
- సత్యసాయి జిల్లా: టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం
- సత్యసాయి జిల్లా: టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
14:09 September 11
లోకేష్‌కు ఫోన్ కాల్ చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
- లోకేష్‌కు ఫోన్ కాల్ చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
- ఫోన్‌లో నారా లోకేష్‌ను పరామర్శించిన నారాయణ
- చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన నారాయణ
- బంద్‌కు సంపూర్ణ మద్దతిచ్చినట్లు తెలిపిన నారాయణ
- నియంత పాలనపై అందరం కలిసి పోరాడదామన్న నారాయణ
- బంద్‌కు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన లోకేష్
14:08 September 11
గుంటూరు: పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యకు నిరసన సెగ
- చంద్రబాబు రిమాండ్‌ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసన
- చేబ్రోలు కొమ్మమూరు కాలువ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన
- అటుగా వెళ్తున్న వెంకట రోశయ్య వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
- టీడీపీ కార్యకర్తల వద్ద సెల్‌ఫోన్లు లాక్కునేందుకు ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది యత్నం
- ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు
14:08 September 11
బాపట్ల జిల్లా: అద్దంకి పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన
- చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో అద్దంకిలో గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో ఆందోళన
- రహదారిపై బైఠాయించిన రవికుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు
- అద్దంకి పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించిన టీడీపీ నాయకులు
- ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని విడుదల చేయాలని డిమాండ్
12:31 September 11
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో యనమల భేటీ
- మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో యనమల భేటీ
- భేటీలో పాల్గొన్న కళా వెంకట్రావు, కంభంపాటి రామ్మోహన్, షరీఫ్
- చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమావేశం
11:51 September 11
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ నాయకుడు దేవదత్ దీక్ష భగ్నం
- ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ నాయకుడు దేవదత్ దీక్ష భగ్నం
- దేవదత్ దీక్ష భగ్నం చేసి ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు
- చంద్రబాబు విడుదలై వచ్చేవరకు దీక్ష చేస్తానన్న దేవదత్
- దేవదత్ 48 గంటల దీక్షను భగ్నం చేసిన పోలీసులు
11:50 September 11
ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ నేతల నిరసనలు
- ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ నేతల నిరసనలు
- పెద్దారవీడు రహదారిపై బైఠాయించిన టీడీపీ నాయకులు
- నిరసన చేపట్టిన టీడీపీ నాయకులను స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- ఎరిక్షన్ బాబును మార్కాపురం తరలించిన పోలీసులు
11:49 September 11
శ్రీకాకుళం: నరసన్నపేటలో జాతీయరహదారిపై టీడీపీ శ్రేణుల ధర్నా
- శ్రీకాకుళం: నరసన్నపేటలో జాతీయరహదారిపై టీడీపీ శ్రేణుల ధర్నా
- జాతీయరహదారిపై టైర్లకు నిప్పు పెట్టి టీడీపీ కార్యకర్తల నిరసన
- టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట
11:48 September 11
ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పరిటాల శ్రీరామ్ అరెస్టు
- ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పరిటాల శ్రీరామ్ అరెస్టు
- ఉదయం పరిటాల శ్రీరామ్ గృహనిర్బంధానికి పోలీసుల యత్నం
- పోలీసుల కళ్లుగప్పి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లిన పరిటాల శ్రీరామ్
- ధర్మవరం గాంధీనగర్ సర్కిల్‌లో టీడీపీ నాయకుల నిరసన
- రోడ్డుపై బైఠాయించిన పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్న పోలీసులు
- పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట
- పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
- ధర్మవరం పోలీస్ స్టేషన్‌కు టీడీపీ నాయకుల తరలింపు
11:48 September 11
తప్పుడు ఆలోచన గల వ్యక్తులు ఉన్న ప్రభుత్వం ఇది: అచ్చెన్న
- తప్పుడు ఆలోచన గల వ్యక్తులు ఉన్న ప్రభుత్వం ఇది: అచ్చెన్న
- చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానం ఉంది: అచ్చెన్న
- చంద్రబాబును హౌస్ అరెస్టుకైనా అనుమతివ్వాలని కోర్టును కోరుతాం: అచ్చెన్న
11:11 September 11
విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో గవర్నర్‌ను కలిసిన జనసేన బృందం
- విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో గవర్నర్‌ను కలిసిన జనసేన బృందం
- పీతల మూర్తియాదవ్ నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన జనసేన బృందం
- గవర్నర్‌ను కలిసిన పీవీఎస్‌ఎన్ రాజు, పంచకర్ల సందీప్, ఉషాకిరణ్, ఇతర నేతలు
11:10 September 11
చంద్రబాబు అరెస్టునకు నిరసనగా తుళ్లూరులో బంద్
- చంద్రబాబు అరెస్టునకు నిరసనగా తుళ్లూరులో బంద్
- తుళ్లూరు బంద్‌లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు
- తుళ్లూరు బంద్‌కు మద్దతు పలికిన రాజధాని రైతులు
- టీడీపీ నాయకులను తుళ్లూరు స్టేషన్‌కు తరలించిన పోలీసులు
10:43 September 11
రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. కేసుతో టీడీపీ నేతలకు సంబంధం ఏంటి?
- రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు
- రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు
- తనకు కూడా తెలియకుండా అరెస్టు చేసినట్లు గవర్నర్ తెలిపారు
- రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు
- నాలుగేళ్ల పాలనలో అవినీతి కనిపించలేదా.. ఇప్పుడే ఎందుకు తెలిసింది
- టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది
- జనసేనతో కలిసి పోటీచేస్తే వైకాపా చిరునామా గల్లంతవుతుందని సర్వేలు
- వైకాపా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఐప్యాక్ సర్వేలో తేలింది
- లోకేష్ పాదయాత్రను అణచివేయాలని యత్నించారు
- కావాలని చంద్రబాబును జైలుకు పంపడం దారుణం
- 48 గంటలపాటు రోడ్లపై తిప్పి సైకో ఆనందం పొందారు
- చంద్రబాబు మనో ధైర్యాన్ని ఎప్పటికీ తొలగించలేరు
- టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదు
- సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకెళ్తాం
- కేసుతో టీడీపీ నేతలకు సంబంధం ఏంటి?
10:36 September 11
వైఎస్‌ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
- వైఎస్‌ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
- ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన
- రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన వరదరాజుల రెడ్డి
- ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
- సొమ్మసిల్లి పడిపోయిన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
- వరదరాజుల రెడ్డిని వాహనంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
10:32 September 11
అచ్చెన్నాయుడు నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు
- విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న టీడీపీ బృందం
- విశాఖ: గవర్నర్‌ను కలిసేందుకు వచ్చిన టీడీపీ నేతలు
- టీడీపీ నేతలకు నిన్న అపాయింట్‌మెంట్ ఇచ్చిన గవర్నర్
- అచ్చెన్నాయుడు నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్న నేతలు
- గవర్నర్‌ను కలవనున్న గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, చిరంజీవిరావు
- గవర్నర్‌ను కలవనున్న రామారావు, రాజబాబు, ఇతర నేతలు
- విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు
- విశాఖ: డీసీపీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో బందోబస్తు
- విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న జనసేన బృందం
- విశాఖ: గవర్నర్‌ను కలిసేందుకు వచ్చిన జనసేన బృందం
- పీతల మూర్తియాదవ్ నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్న జనసేన బృందం
- గవర్నర్‌ను కలవనున్న పీవీఎస్‌ఎన్ రాజు, పంచకర్ల సందీప్, ఉషాకిరణ్, ఇతర నేతలు
10:10 September 11
ధర్మవరంలో టీడీపీ మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్
- సత్యసాయి: ధర్మవరంలో టీడీపీ మహిళల నిరసన
- నిరసనలో పాల్గొన్న టీడీపీ మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్
- గాజులు పగిలి పలువురు మహిళా కార్యకర్తలకు గాయాలు
09:55 September 11
విశాఖలో గవర్నర్‌ను కలవనున్న జనసేన బృందం
- విశాఖలో గవర్నర్‌ను కలవనున్న జనసేన బృందం
- పీతల మూర్తియాదవ్ నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్న జనసేన బృందం
- గవర్నర్‌ను కలవనున్న పీవీఎస్‌ఎన్ రాజు, పంచకర్ల సందీప్, ఉషాకిరణ్, ఇతర నేతలు
09:53 September 11
వెంకటాపురంలో పరిటాల సునీత ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
- సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత గృహ నిర్బంధం
- వెంకటాపురంలో పరిటాల సునీత ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
- పోలీసుల నిర్బంధాన్ని దాటుకుని బయటకు వచ్చిన పరిటాల సునీత
- టీడీపీ నాయకులతో కలిసి గ్రామం నుంచి రామగిరి వైపు ర్యాలీ
- పోలీసులు అడ్డుకుంటున్నా ముందుకు వెళ్తున్న పరిటాల సునీత
09:37 September 11
విజయవాడ బస్టాండ్ ఎదుట టీడీపీ, జనసేన శ్రేణుల నిరసన
- విజయవాడ బస్టాండ్ ఎదుట టీడీపీ, జనసేన శ్రేణుల నిరసన
- నల్ల జెండాలతో నిరసన చేపట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
- నిరసనలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
- గద్దె రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గద్దె రామ్మోహన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను తోసేసిన కృష్ణలంక సీఐ
- సీఐ తోసేయడంతో కిందపడిన గద్దె రామ్మోహన్
09:36 September 11
చంద్రబాబుకు వైద్య పరీక్షలు
- కాసేపట్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
- రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు
- చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆసుపత్రి
- ఇవాళ చంద్రబాబుతో ముగ్గురు కుటుంబసభ్యుల ములాకత్
- భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ములాకత్‌కు అనుమతి
09:36 September 11
సెంట్రల్ జైలులో చంద్రబాబు.. అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లిన సిబ్బంది
- రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు
- చంద్రబాబుకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లిన సిబ్బంది
- ఇంటి భోజనానికి అనుమతి దృష్ట్యా ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ పంపిన కుటుంబసభ్యులు
09:29 September 11
విజయవాడ బస్టాండ్ ఎదుట టీడీపీ, జనసేన శ్రేణుల నిరసన
- విజయవాడ బస్టాండ్ ఎదుట టీడీపీ, జనసేన శ్రేణుల నిరసన
- నల్ల జెండాలతో నిరసన చేపట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
- నిరసనలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
- గద్దె రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
09:29 September 11
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ, జనసేన నేతల ముందస్తు అరెస్టు
- విజయనగరం: శృంగవరపుకోటలో టీడీపీ, జనసేన నేతల ముందస్తు అరెస్టు
- శృంగవరపుకోటలో బస్టాండ్ ముందు మోహరించిన పోలీసులు
- పార్వతీపురం మన్యం సాలూరులో టీడీపీ నాయకుల గృహ నిర్బంధం
09:28 September 11
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
- నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
- వందల కుటుంబాలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని కోటంరెడ్డి ఆందోళన
- తనను స్టేషన్‌లో లేదా లాకప్‌లో ఉంచాలన్న కోటంరెడ్డి
- ఇంట్లో నుంచి కోటంరెడ్డి బయటకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
- నెల్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కోటంరెడ్డి వాగ్వాదం
09:27 September 11
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ నేత కిమిడి నాగార్జున గృహ నిర్బంధం
- విజయనగరం: చీపురుపల్లిలో టీడీపీ నేత కిమిడి నాగార్జున గృహ నిర్బంధం
- గృహ నిర్బంధం నుంచి బయటపడి ధర్నాలో పాల్గొన్న కిమిడి నాగార్జున
- చీపురుపల్లి మూడురోడ్ల కూడలిలో టీడీపీ శ్రేణుల ధర్నా
- చీపురుపల్లిలో టీడీపీ బంద్‌కు బీజేపీ నాయకుడు గద్దె బాబూరావు మద్దతు
- కిమిడి నాగార్జునతో పాటు ధర్నాలో పాల్గొన్న గద్దె బాబూరావు
09:27 September 11
ప్రకాశం: టీడీపీ బంద్ పిలుపుతో హనుమంతునిపాడులో నిరసనలు
- ప్రకాశం: టీడీపీ బంద్ పిలుపుతో హనుమంతునిపాడులో నిరసనలు
- రహదారిపై టైర్లు కాల్చి నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు
08:59 September 11
అనంతపురం టవర్ క్లాక్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- అనంతపురం టవర్ క్లాక్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
అర్ధరాత్రి నుంచి రహస్య ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
08:58 September 11
టీడీపీ బంద్ పిలుపుతో అమలాపురంలో కార్యకర్తల నిరసన
- టీడీపీ బంద్ పిలుపుతో అమలాపురంలో కార్యకర్తల నిరసన
- అమలాపురం: 20 మంది టీడీపీ నాయకుల అరెస్టు
08:57 September 11
టీడీపీ నేతల గృహ నిర్బంధాలు..
- తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గృహనిర్బంధం
- తూ.గో.: ఉండ్రాజవరంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గృహనిర్బంధం
- గుడివాడ: టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము గృహనిర్బంధం
- కల్యాణదుర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వనాయుడు గృహనిర్బంధం
08:57 September 11
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు బస్టాండ్ వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన
- ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు బస్టాండ్ వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన
స్వచ్ఛందంగా మూతబడిన హోటళ్లు, వ్యాపార సంస్థలు
08:56 September 11
కర్నూలు: టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గృహ నిర్బంధం
- కర్నూలు: టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గృహ నిర్బంధం
08:37 September 11
నంద్యాలలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఫరూక్ గృహ నిర్బంధం
- నంద్యాలలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఫరూక్ గృహ నిర్బంధం
- కర్నూలు: పత్తికొండలో కేఈ శ్యాంబాబు గృహ నిర్భంధం
08:36 September 11
నంద్యాల గాంధీచౌక్‌లో కూరగాయల మార్కెట్ వద్ద నిరసన
- నంద్యాల గాంధీచౌక్‌లో కూరగాయల మార్కెట్ వద్ద నిరసన
- నిరసనలో పాల్గొన్న టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ అరెస్ట్
- నంద్యాల బస్టాండ్ వద్ద టీడీపీ నిరసనలు
- నిరసనలో పాల్గొన్న భూమా బ్రహ్మానంద రెడ్డి అరెస్టు
08:13 September 11
విశాఖ: టీడీపీ బంద్ పిలుపుతో జిల్లాలో పలుచోట్ల నిరసనలు
- విశాఖ: టీడీపీ బంద్ పిలుపుతో జిల్లాలో పలుచోట్ల నిరసనలు
- అల్లూరి జిల్లా: జి.మాడుగులలో టీడీపీ కార్యకర్తల నిరసన
- దుకాణాలు స్వచ్ఛందంగా మూసిన వ్యాపారులు
- విశాఖ: జీవీఎంసీ 5, 6, 7, 8 వార్డుల టీడీపీ నాయకుల అరెస్టు
- అరెస్టు చేసిన టీడీపీ నాయకులను పీఎంపాలెం పీఎస్‌కు తరలింపు
08:13 September 11
విశాఖ: చినవాల్తేరులో అచ్చెన్నాయుడు గృహ నిర్బంధం
- విశాఖ: చినవాల్తేరులో అచ్చెన్నాయుడు గృహ నిర్బంధం
- అచ్చెన్నాయుడు ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
- అనకాపల్లి: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గృహ నిర్బంధం
- పరవాడ వెన్నెలపాలెంలో సత్యనారాయణమూర్తి గృహ నిర్బంధం
08:12 September 11
పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి
- అనంతపురం: పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి
- కల్యాణదుర్గంలో హనుమంతరాయచౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఉదయం నడకకు వెళ్లినపుడు అదుపులోకి తీసుకుని ఎర్రంపల్లి నివాసానికి తరలింపు
08:12 September 11
పరిటాల సునీత గృహ నిర్బంధం
- సత్యసాయి జిల్లా: రామగిరి మం. వెంకటాపురంలో పరిటాల సునీత గృహ నిర్బంధం
- పరిటాల సునీత ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
- ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ గృహ నిర్బంధం
08:12 September 11
ఏలూరు జూట్ మిల్లు కూడలిలో టీడీపీ, జనసేన నేతల నిరసన
- ఏలూరు జూట్ మిల్లు కూడలిలో టీడీపీ, జనసేన నేతల నిరసన
- జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఎదుట టీడీపీ శ్రేణుల నిరసన
08:11 September 11
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గృహ నిర్బంధం
- నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గృహ నిర్బంధం
- పోలీసుల నోటీసును తిరస్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- మూడు రోజులుగా నిర్బంధించి ఇబ్బందులు పెడుతున్నారు: శ్రీధర్‌రెడ్డి
- మూడు రోజులుగా మాగుంట లేఔట్‌ను అష్టదిగ్బంధం చేశారు: కోటంరెడ్డి
- నా కోసం మాగుంట లేఔట్‌లో వందల కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దు: కోటంరెడ్డి
- నన్ను రమ్మంటే ఏ పోలీస్ స్టేషన్‌కైనా వస్తా: కోటంరెడ్డి
- నా ఆఫీసులోనే ఉంటా.. అక్కడైనా అరెస్టు చేయండి: కోటంరెడ్డి
- ప్రభుత్వాన్ని మీరు సంతోషపెట్టాలనుకుంటే లాకప్‌కైనా సిద్ధం: కోటంరెడ్డి
- గృహనిర్బంధం పేరుతో నా సిబ్బంది రాకుండా చేస్తున్నారు: కోటంరెడ్డి
- పోలీసులకు సహకరిస్తా: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
08:11 September 11
చంద్రబాబు అరెస్టు తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చతెచ్చేలా ఉంది: సుజనా చౌదరి
- చంద్రబాబు అరెస్టు తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చతెచ్చేలా ఉంది: సుజనా చౌదరి
- రాజకీయ ప్రత్యర్థుల్ని ఏదో ఒక కేసులో జైలుకు పంపాలని యత్నం: సుజనా చౌదరి
- వైసీపీ ప్రభుత్వ వైఖరి గర్హనీయం: సుజనా చౌదరి
- రాష్ట్రంలో ప్రబలుతున్న అరాచకానికి ఇది పరాకాష్ట: సుజనా చౌదరి
07:47 September 11
ఆత్మకూరులో టీడీపీ శ్రేణులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- నెల్లూరు: టీడీపీ బంద్ పిలుపుతో కార్యకర్తల నిరసనలు
- నెల్లూరు: ఆత్మకూరు ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
- ఆత్మకూరు బస్టాండ్ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన
- నిరసన చేపట్టిన టీడీపీ శ్రేణులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- టీడీపీ శ్రేణులను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- దుత్తలూరులో టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నెల్లూరులోని అన్ని కూడళ్లలో మోహరించిన పోలీసులు
- వెంకట్రావుపల్లి వద్ద జాతీయరహదారిపై టీడీపీ శ్రేణుల నిరసన
07:34 September 11
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు
- రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు
- రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతల గృహ నిర్బంధాలు
- నంద్యాల: ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిల ప్రియ గృహ నిర్బంధం
- శ్రీకాకుళం: మూడు రోజులుగా గృహ నిర్బంధంలో టీడీపీ నాయకులు
- ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే అశోక్ గృహ నిర్బంధం
- అనకాపల్లి: నర్సీపట్నంలో టీడీపీ నేతల గృహ నిర్బంధం
07:33 September 11
నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
- నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
- చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ బంద్‌కు పిలుపు
- బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలని ప్రజలకు పిలుపు
- టీడీపీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు జనసేన మద్దతు
- టీడీపీ తలపెట్టిన బంద్‌కు సీపీఐ, లోక్‌సత్తా, ఎంఆర్‌పీఎస్ మద్దతు
- నేడు సెలవు ప్రకటించిన కొన్ని పాఠశాలలు, వ్యాపార సముదాయాలు
- రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు
- రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతల గృహ నిర్బంధాలు
06:58 September 11
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఉద్రిక్తత, బస్సులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
- శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఉద్రిక్తత
- ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
- టీడీపీ శ్రేణులను శ్రీకాకుళం పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
- మూడు రోజులుగా గృహ నిర్బంధంలో టీడీపీ నాయకులు
- ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే అశోక్ గృహ నిర్బంధం
06:43 September 11
నంద్యాల: ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిల ప్రియ గృహ నిర్బంధం
- నంద్యాల: ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిల ప్రియ గృహ నిర్బంధం
06:43 September 11
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
- ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
- గిద్దలూరు ఆర్టీసీ డిపో వద్ద బస్సులు అడ్డగింత, పీఎస్‌కు తరలింపు
06:43 September 11
అనకాపల్లి: నర్సీపట్నంలో టీడీపీ నేతల గృహ నిర్బంధం
- అనకాపల్లి: నర్సీపట్నంలో టీడీపీ నేతల గృహ నిర్బంధం
06:42 September 11
పాడేరు: రోడ్లపైకి చేరుకుని టీడీపీ కార్యకర్తల ఆందోళన
- పాడేరు: రోడ్లపైకి చేరుకుని టీడీపీ కార్యకర్తల ఆందోళన
- పాడేరులో యథావిధిగా తిరుగుతున్న ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు
06:41 September 11
విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా
- విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా
- బస్‌స్టాండ్ ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్న టీడీపీ నేతలు
- విజయనగరం: సీఎం డౌన్‌డౌన్, సైకో పాలన పోవాలంటూ నినాదాలు
- చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్
06:41 September 11
చిత్తూరు: శ్రీరంగరాజపురం వద్ద ఉద్రిక్తత
- చిత్తూరు: శ్రీరంగరాజపురం వద్ద ఉద్రిక్తత
- చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై టీడీపీ నేతల ఆందోళన
- చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతల ఆందోళన
- రహదారిపై టైర్లు కాల్చి, వాహనరాకపోకలను అడ్డుకొన్న టీడీపీ శ్రేణులు
- మండల పార్టీ అధ్యక్షుడు జయశంకరనాయుడును అరెస్టు చేసిన పోలీసులు
06:41 September 11
రాష్ట్ర ప్రజలకు లేఖ రాసిన నారా లోకేష్
- రాష్ట్ర ప్రజలకు లేఖ రాసిన నారా లోకేష్
- కన్నీళ్లతో, బరువెక్కిన హృదయంతో లేఖ రాస్తున్నా: లోకేష్
- తెలుగువారి అభ్యున్నతి కోసం మా నాన్న ఎంతో శ్రమించారు: లోకేష్
- లక్షలమంది జీవితాల్లో మార్పు రావాలని నిత్యం తపించేవారు: లోకేష్
- చంద్రబాబుకు విశ్రాంతి తీసుకోవడం తెలియదు: నారా లోకేష్
- నాన్న నుంచి ప్రేరణ పొంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నా: లోకేష్
- అమెరికాలో ఉద్యోగం వదిలిమరీ దేశానికి తిరిగివచ్చా: నారా లోకేష్
- రాజకీయ పగలు, కక్షలకు హద్దులు లేవా?: నారా లోకేష్
- మా నాన్న పోరాట యోధుడు.. నేనూ అంతే..: నారా లోకేష్
- ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని ప్రజలను కోరుతున్నా: నారా లోకేష్
06:40 September 11
చంద్రబాబును రాజమహేంద్రవరం తరలించే ప్రక్రియలో పోలీసుల అరాచకం
- చంద్రబాబును రాజమహేంద్రవరం తరలించే ప్రక్రియలో పోలీసుల అరాచకం
- జోరు వర్షంలో వీధి దీపాలు ఆర్పించి ప్రయాణం కొనసాగించిన పోలీసులు
- 144 సెక్షన్ సాకుతో తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ నిర్బంధం
- చంద్రబాబు వాహనశ్రేణి వెనుక ఇతర నేతల వాహనాలు రాకుండా అడ్డంకులు
- ఇతర వాహనాలు రాకుండా రహదారిపై లారీలు అడ్డు పెట్టించిన పోలీసులు
- గన్నవరం వద్ద గంటన్నర పాటు వాహనాలు నిలిపివేసిన పోలీసులు
- టోల్‌గేట్ల వద్ద ఇతర వాహనాలు రాకుండా నియంత్రించిన పోలీసులు
- చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్
06:40 September 11
చంద్రబాబును రాజమహేంద్రవరం తరలింపులోనూ పోలీసుల నిర్లక్ష్యం
- చంద్రబాబును రాజమహేంద్రవరం తరలింపులోనూ పోలీసుల నిర్లక్ష్యం
- రెండున్నర గంటల ప్రయాణాన్ని నాలుగున్నర గంటలు సాగదీసిన పోలీసులు
- అప్పటికే 48గంటల నుంచి నిద్రలేకుండా ఉన్న చంద్రబాబు
- అర్ధరాత్రి 1.30 గంటలకు చంద్రబాబుని రాజమహేంద్రవరం తీసుకొచ్చిన పోలీసులు
- పేపర్ వర్క్ తరువాత అర్ధరాత్రి 2.30 గంటలకు జైలులోనికి వెళ్లిన చంద్రబాబు
- లోకేష్‌ను మాత్రమే ప్రధాన ద్వారం వరకు అనుమతించిన పోలీసులు
- చంద్రబాబును చూసి ఉద్వేగానికి లోనైన లోకేష్
- అంతా ధైర్యంగా ఉండాలని చెప్పిన చంద్రబాబు
- అక్రమ కేసులు తననేమీ చేయలేవని లోకేష్‌కు చెప్పిన చంద్రబాబు
- అమ్మ జాగ్రత్త అని లోకేష్‌కి చెప్పి జైలులోనికి వెళ్లిన చంద్రబాబు
06:38 September 11
చంద్రబాబుకు ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది: పవన్ కల్యాణ్
- చంద్రబాబుకు ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది: పవన్ కల్యాణ్
- అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ చంద్రబాబును జైలుకు పంపారు: పవన్
- అధికారంలోకి వచ్చాక ఇసుక దొంగలను వదిలే ప్రసక్తే లేదు: పవన్ కల్యాణ్
- తుదిశ్వాస వరకు జగన్‌పై పోరాటం చేస్తా: పవన్ కల్యాణ్
- యుద్ధం కావాలని కోరుకుంటే అందుకు మేం సిద్ధం: పవన్ కల్యాణ్
- జగన్.. నువ్వు జైలుకు వెళ్తే అందరూ జైలుకు వెళ్లాలా?: పవన్ కల్యాణ్
- తెలంగాణలో జగన్‌ను రాళ్లతో తరిమికొట్టారు: పవన్ కల్యాణ్
- రేపు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి రావచ్చు: పవన్ కల్యాణ్
- జగన్ రాష్ట్రానికి హానికరం.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మన బాధ్యత: పవన్
- వారాహి యాత్రపై దాడికి 2 వేలమంది నేరగాళ్లను దింపారు: పవన్
- కోనసీమ జిల్లాలో 50 మందిని చంపేయాలని కుట్ర పన్నారు: పవన్
- వైకాపా మూకల కుట్ర తెలిసి కేంద్ర పెద్దలు దాన్ని నిలువరించారు: పవన్
- చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్‌పై వచ్చినవాళ్లు సీఎం కాలేరు: పవన్
- ఈ ప్రభుత్వం.. రాజకీయాలను మరో స్థాయికి దిగజార్చింది: పవన్ కల్యాణ్
06:15 September 11
Live Updates: నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
- నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
- చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్: అచ్చెన్నాయుడు
- జగన్ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా బంద్: అచ్చెన్న
- బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలని ప్రజలకు పిలుపు
- టీడీపీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు జనసేన మద్దతు
- టీడీపీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు సీపీఐ, ఎమ్మార్పీఎస్ మద్దతు
- నేడు సెలవు ప్రకటించిన కొన్ని పాఠశాలలు, వ్యాపార సముదాయాలు