తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viral Video: ఆస్పత్రి నుంచి శిశువును సంచిలో ఎత్తుకెళ్లిన మహిళ - తమిళనాడు నేర వార్తలు

నాలుగు రోజుల వయసున్న ఓ శిశువు ఆసుపత్రిలో అపహరణకు గురైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. బాలింతకు సహాయంగా ఉండేందుకు వచ్చిన గుర్తుతెలియని మహిళే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

infant
ప్రభుత్వాసుపత్రి నుంచి శిశువు మాయం

By

Published : Oct 9, 2021, 2:20 PM IST

ప్రభుత్వాసుపత్రి నుంచి శిశువు మాయం

నాలుగు రోజుల శిశువును గుర్తు తెలియని మహిళ అపహరించిన ఘటన తమిళనాడు తంజావూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

ఇదీ జరిగింది..

బర్మా కాలనీలో నివసించే గుణశేఖరన్-రాజలక్ష్మీలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెద్దలు వీరి పెళ్లిని అంగీకరించని కారణంగా.. బంధువులు ఎవరూ ఆసుపత్రి వద్దకు రాలేదు. కానీ.. పరిచయం లేని ఓ మహిళ మాత్రం స్వచ్ఛందంగా సహాయం చేస్తానంటూ ముందుకొచ్చింది. గత మూడు రోజులుగా రాజలక్ష్మీకి బాగానే సహాయం చేస్తోంది.

ఈ క్రమంలో ఓ రోజు టాయ్​లెట్​కి వెళ్లిన రాజలక్ష్మీకి(బాలింతకు) మూర్ఛవచ్చిందని ఆమె భర్తను నమ్మించింది. వేడి నీళ్లు తీసుకురావాలని పంపింది. అలాగే.. రాజలక్ష్మీ బాత్రూం నుంచి బయటకు రాకముందే తన వద్ద ఉన్న సంచిలో చిన్నారిని ఎత్తుకెళ్లింది.

దీనిని గ్రహించిన దంపతులు వెంటనే తంజావూర్ పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళ ఆసుపత్రి నుంచి శిశువుతో పారిపోతున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమెను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details