తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో దీపావళి పండుగను (diwali festival celebration in india) వినూత్నంగా జరుపుకున్నారు. జిల్లాలోని గుమటపురం గ్రామానికి చెందిన ప్రజలు పండుగ రోజు ఒకే చోట చేరి గోరాయ్హబ్బా అనే ప్రత్యేక కార్యక్రమంతో వేడుక చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆవు పేడను ఒకరిపై మరొకరు విసురుకుంటూ సందడి సందడిగా గడిపారు.
వందేళ్ల చరిత్ర..
ఈ పండుగలో గ్రామస్థులు శరీర భాగాలకు పేడను పూసుకుంటూ (indian cow dung festival) వేడుక చేసుకుంటారు. అయితే.. కోపాన్ని దరిచేరనీయరు. పేడను విసురుకునేప్పుడు ఇతరుల పట్ల స్నేహభావాన్నే కలిగి ఉంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గత వందేళ్ల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.