ఇంటికి వచ్చిన తన భర్త ప్రియురాలిని కత్తితో తొమ్మిది చోట్ల పొడిచి చంపేసింది ఓ యువతి. వెంటనే తన భర్తను తీసుకుని పరారైంది. కానీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌లో దొరికిపోయింది. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో జరిగిన ఈ 'ట్రయాంగిల్ లవ్ స్టోరీ' క్రైమ్‌లో ఓ ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే?
పోలీసుల వివరాల ప్రకారం..జిల్లాలోని ఇడయార్పాళయానికి చెందిన సుజయ్.. కొంతకాలం క్రితం రేష్మ అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు. కానీ వారిద్దరి పెళ్లికి తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడం వల్ల విడిపోయారు. ఆ తర్వాత సుజయ్.. స్థానికంగా ఓ కళాశాలలో చదువుతున్న సుబ్బులక్ష్మితో ప్రేమలో పడ్డాడు.
కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. సుబ్బులక్ష్మితో ప్రేమలో ఉన్న సుజయ్‌కు అతడి కుటుంబసభ్యులు రేష్మతో వివాహం ఖరారు చేశారు. పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత పొల్లాచ్చి ప్రాంతానికి వచ్చి రేష్మతో కొత్త కాపురం ప్రారంభించాడు సుజయ్. ఇటీవలే రేష్మ గర్భం కూడా దాల్చింది. కానీ తరచూ సుబ్బలక్ష్మితో సుజయ్ ఫోన్లో మాట్లాతుండేవాడు. ఈ క్రమంలోనే సుబ్బులక్ష్మి.. మే 2వ తేదీన సుజయ్ ఇంటికి వచ్చింది. సుజయ్, రేష్మ పెళ్లి చేసుకున్నారని తెలిసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత సుబ్బులక్ష్మి, రేష్మ మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో ఆగ్రహానికి గురైన రేష్మ.. దగ్గర్లోని కత్తి తీసుకుని సుబ్బులక్ష్మిని తొమ్మిది చోట్ల పొడిచింది. సుబ్బులక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే అక్కడి నుంచి సుజయ్, రేష్మ పరారయ్యారు. ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సుజయ్ ఇంటికి చేరుకున్నారు. సుబ్బులక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల కోసం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సుజయ్, ఎనిమిది నెలల గర్భిణీ అయిన రేష్మను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
స్కూల్ విద్యార్థినిపై వేధింపులు.. కానిస్టేబుల్ అరెస్ట్
ప్రజలను కాపాడాల్సిన ఓ పోలీస్.. పాఠశాల విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెపై వేధింపులకు గురిచేశాడు కానిస్టేబుల్. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. కాంట్ ప్రాంతానికి చెందిన బాధిత విద్యార్థిని.. సైకిల్‌పై తన స్కూల్ నుంచి ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో అటువైపుగా బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్ సాదత్ అలీ.. విద్యార్థిని పక్కకు వెళ్లాడు. అనంతరం వేధింపులకు గురిచేశాడు. ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ వేధించాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. నిఘా పెట్టిన తల్లిదండ్రులు కానిస్టేబుల్ బాలికను వెంబడిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని.. ఘటనను వీడియో తీశారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు.. కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. సాదత్ అలీపై సస్పెన్షన్ వేటు వేశారు