తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట స్టాలిన్​కే జై కొట్టిన సర్వేలు! - ఎగ్జిట్​ పోల్స్​ 2021

తమిళనాడులో డీఎంకే ప్రభంజనం సృష్టించనుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే.. అధికార పీఠాన్ని అధిరోహించనుందని వెల్లడించాయి. అన్నాడీఎంకేతో జతకట్టిన భాజపాకు ఆశాభంగం తప్పదని తెలిపాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 234 శాసనస్థానాల్లో 70 శాతానికిపైగా సీట్లు.. డీఎంకే హస్తగతం చేసుకునుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

Tamilnadu Exit Polls
తమిళనాడు ఎగ్జిట్​పోల్స్​

By

Published : Apr 29, 2021, 8:52 PM IST

Updated : Apr 29, 2021, 9:08 PM IST

తమిళనాట జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం సృష్టించనుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 234 స్థానాల్లో.. డీఎంకే 160 నుంచి 170 స్థానాలు కైవసం చేసుకుంటుందని.. రిపబ్లిక్‌ టీవీ సీఎన్​ఎక్స్​ సర్వే వెల్లడించింది. అన్నాడీఎంకే కూటమికి 58 నుంచి 68 మధ్య స్థానాలు వస్తాయన్న రిపబ్లిక్‌ టీవీ సీఎన్ఎక్స్​ ఎగ్జిట్‌ పోల్స్‌.. ఏఎంఎంకే 4 నుంచి 6 స్థానాలు వస్తాయని వెల్లడించాయి. ఇతరులకు 2 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఈటీవీ భారత్​ సర్వే వివరాలు

పీ మార్క్​ సర్వే వివరాలిలా..

పీ మార్క్‌ సర్వే కూడా కూడా ఇలాంటి అంచనాలే వెల్లడించింది. డీఎంకే 165 నుంచి 190 స్థానాలు కైవసం చేసుకుంటుందని.. అధికార అన్నాడీఎంకే 40 నుంచి 65 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఏఎంఎంకే 1 నుంచి 3 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

టుడేస్​ చాణక్య అంచనా..

తమిళనాడులో డీఎంకే భారీ విజయం ఖాయమని టుడేస్ చాణక్య సర్వే తెలిపింది. డీఎంకే 164 నుంచి 186 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అన్నాడీఎంకే 46 నుంచి 68 స్థానాలకే పరిమితమవుతుందని.. ఇతరులకు 0 నుంచి 6 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

ఇండియా టుడే సర్వే..

తమిళనాడులో డీఎంకే భారీ విజయం ఖాయమని ఇండియా టుడే-యాక్సిస్​ సర్వే వెల్లడించింది. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే 175 నుంచి 195 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనా వేసింది. అన్నాడీఎంకేకు 38 నుంచి 54 స్థానాలే వస్తాయని సర్వే వెల్లడించింది. కమల్‌హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యంకు 2 స్థానాలు వస్తాయని తెలిపిన ఇండియా టుడే-యాక్సిస్​ సర్వే.....ఇతరులకు 1 నుంచి 7 స్థానాలు దక్కుతాయని తెలిపింది.

ఇదీ చదవండి: తమిళ పోరు.. కీలక స్థానాల్లో గెలుపెవరిది..?

Last Updated : Apr 29, 2021, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details