Teacher Sexual Abuse: పాఠాలతో విద్యార్థులకు సరైన దారి చూపించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా ప్రవర్తించింది. ట్యూషన్లకని వచ్చిన విద్యార్థులను లైంగికంగా వేధించేది. ఈ ఘటన తమిళనాడు మధురై జిల్లా బెతానియాపురమ్ ప్రాంతంలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితురాలు సహా ఆమె బాయ్‌ఫ్రెండ్ వీరమణిని (39) అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేసే నిందితురాలికి వీరమణి అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త కొంతకాలం క్రితం ఆమెకు విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రియుడితో మరింత సాన్నిహిత్యం పెంచుకున్న నిందితురాలు.. వీరమణి ప్రభావంతో పోర్న్ చిత్రాలకు బానిసైంది. ఈ క్రమంలో ట్యూషన్లకు వచ్చిన విద్యార్థులతో లైంగిక వాంఛ తీర్చుకోవాలని భావించింది. అసభ్యకరమైన చిత్రాలను పంపుతూ వారిని ముగ్గులోకి దింపి లైంగికంగా వేధించేది. ఈ వేధింపులకు ఆమె కుమారుడు కూడా బాధితుడే.