దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 18,023 కేసులు నమోదయ్యాయి. మరో 409 మంది ప్రాణాలు కోల్పోయారు. 31,045 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 316 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 41 మంది వైరస్ కారణంగా మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో 15,567 కేసులు నమోదయ్యాయి. 124 మంది మృతి చెందారు.
- మహారాష్ట్రలో 10,891 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 295 మంది చనిపోయారు.
- కర్ణాటకలో 10,000 కేసులు బయటపడ్డాయి. 179 మంది మరణించారు.
- బంగాల్లో 5,427 కేసులు బయటపడ్డాయి. 98 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
- గుజరాత్లో 695 కేసులు వెలుగు చూశాయి. 11 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో 797 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్‌తో 94 మంది కన్నుమూశారు.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 535 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 36 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:B.1.1.28.2: కొత్త వేరియంట్.. తీవ్ర లక్షణాలు!