తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తరతరాల అవినీతికి కాంగ్రెస్, డీఎంకే నిదర్శనం' - జేపీ నడ్డా

అవినీతికి, వారసత్వ రాజకీయాలకు డీఎంకే, కాంగ్రెస్​ పార్టీలు నిదర్శనమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. 3జీ, 4జీ అంటే గాంధీ, స్టాలిన్ కుటుంబాల తరతరాల అవినీతి అని తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు.

Nadda
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

By

Published : Apr 3, 2021, 3:14 PM IST

తమిళనాడులోని మొదకురిచిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో డీఎంకే, కాంగ్రెస్​ కూటమిపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డీఎంకే, కాంగ్రెస్​లు తరాతరాల అవినీతికి నిదర్శమని వ్యాఖ్యానించారు.

"2జీ అంటే మారన్​ కుటుంబం రెండు తరాల అవినీతి. 3జీ అంటే స్టాలిన్ కుటుంబం మూడు తరాల అవినీతి. 4జీ అంటే.. కాంగ్రెస్-గాంధీ కుటుంబం నాలుగు తరాల అవినీతి అని అర్థం."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

వారసత్వ రాజకీయాలకు, గొడవలకు, అవినీతి సంపాదనకు డీఎంకే మరో రూపం అని ఆరోపించారు నడ్డా.

ఇదీ చదవండి:మహంత శకం ముగిసినట్లేనా?

ABOUT THE AUTHOR

...view details