Supreme Court Virtual Hearing: సుప్రీం కోర్టు కార్యకలాపాలపై మళ్లీ కరోనా ఎఫెక్ట్ పడింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సహా కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో.. వర్చువల్ విచారణలకు సిద్ధమైంది. సోమవారం నుంచి రెండు వారాల పాటు అన్ని కేసుల విచారణలు వర్చువల్‌గానే జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది.
హైబ్రిడ్ పద్ధతిలో కోర్టు నిర్వహణకు వీలుగా 2021 అక్టోబర్ 7న జారీచేసిన ప్రామాణిక నిర్వహణ నిబంధనలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
శీతాకాలం సెలవుల అనంతరం.. సుప్రీం కోర్టు జనవరి 3న తిరిగి తెరుచుకోనుంది.