తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెగసస్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

దేశంలో తీవ్ర దుమారం రేపిన పెగసస్​ హ్యాకింగ్​ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్పైవేర్​ దుర్వినియోగం జరిగిందా? అనే అంశంపై ప్రధానంగా ఆరాతీయనుంది.

PEGASUS
PEGASUS

By

Published : Sep 13, 2021, 5:57 AM IST

Updated : Sep 13, 2021, 6:06 AM IST

దేశంలో సంచలనం సృష్టించిన పెగసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ఊహాగానాలు, మీడియాలో వచ్చిన నిరాధార వార్తల ఆధారంగా ఆ పిటిషన్లను దాఖలు చేశారని కేంద్రం గతంలో తన లఘు అఫిడవిట్‌లో కోర్టుకు తెలియజేసింది. పెగాసస్‌పై నెలకొన్న సందేహాలను పార్లమెంటులో కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఇప్పటికే నివృత్తి చేశారని వివరించింది. పూర్తిస్థాయి అఫిడవిట్‌ సమర్పించడానికి కేంద్రానికి ఉన్న సమస్య ఏంటని సుప్రీం ప్రశ్నించింది.

జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అంశాలను తమకు వెల్లడించాల్సిన అవసరం లేదంది. అఫిడవిట్‌పై నిర్ణయం తీసుకునే అధికారులను కొన్ని కారణాల వల్ల తాను కలవలేకపోయానని, ఈ విషయమై తమ సమాధానం తెలియజేయడానికి గడువు కావాలని సొలిసిటల్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును కోరారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 7న ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఆ పిటిషన్లపై సోమవారం వాదనలు విననుంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2021, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details