OBC Reservation in Maharashtra: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు కేటాయించిన 27 శాతం సీట్లను జనరల్ స్థానాలుగా పరిగణించాలని సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
'ఓబీసీ స్థానాలను జనరల్ సీట్లుగా మార్చండి'
OBC Reservation in Maharashtra: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓబీసీకి కేటాయించిన సీట్లను జనరల్ స్థానాలగా మార్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలింగ్ వాయిదా విజ్ఞప్తి తిరస్కరించింది ధర్మాసనం.
ఇతర సీట్లకు ఎన్నికలు నిర్వహించి, ఓబీసీలకు రిజర్వు చేసిన స్థానాలకు మాత్రం జరపకూడదంటూ ఈ నెల 6న సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. ఓబీసీ స్థానాలను జనరల్ స్థానాలుగా పరిగణించాలని ఆదేశించింది. వీటి ఎన్నికల నిర్వహణకు వారం రోజుల్లోగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వెనుకబాటుతనాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఇదే విధానం కొనసాగుతుందని తెలిపింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని మాత్రం తిరస్కరించింది.
ఇదీ చూడండి:Bipolar man as Judge: దిల్లీలో జిల్లా కోర్టు జడ్జిగా 'బైపోలార్ మ్యాన్'