కరోనా టీకా ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశీయంగా టీకా అవసరాలపై జాగ్రత్తలు తీసుకుంటూనే.. వ్యాక్సిన్ ఎగుమతులను కొనసాగిస్తామని పేర్కొంది. సరిపడా టీకా డోసులు అందుబాటులో లేవని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. కేంద్రం చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
స్వదేశీ అవసరాలు ఎక్కువైతే టీకా ఎగుమతులపై ప్రభావం పడుతుందా అనే ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖా ప్రతినిధి సమాధానం చెబుతూ.. "స్వదేశీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తాం. టీకా పంపిణీపై వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంచుతున్నాం" అని చెప్పారు.